అమెజాన్ ప్రైమ్‌లో జీ-జాంబీ!

అమెజాన్ ప్రైమ్‌లో జీ-జాంబీ!

మహిళా దర్శకురాలు దీపిక దర్శకత్వంలో జాంబీ వైరస్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా ‘జీ జాంబీ’. ఫిబ్రవరి 5వ తేదీన థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా.. త్వరలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతుంది. కొత్త వారితో కొత్త కాన్సెప్ట్‌తో విడుదలైన ఈ సినిమా థియేటర్‌లో మిస్ అయ్యామని ఫీల్ అయ్యే ప్రేక్షకులు త్వరలో అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు.

“మేము తీసిన ఈ ప్రయత్నానికి ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా వచ్చిన నన్ను సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. కాన్సెప్ట్ కొత్తగా ఉంటే మేమున్నామని ప్రేక్షకులు మా జీ జాంబీ సినిమాను ఆదరించారు. థియేటర్ లో మా సినిమాను సక్సెస్ చేసిన మీ అందరికి రుణపడి ఉంటాను.

చిన్న ఊర్లలో మా సినిమా రిలీజ్ కానప్పటికీ సిటీస్ కి వచ్చి సినిమా చూసిన ఆడియన్స్ కు ధన్యవాదాలు. రెస్పాన్స్ చూస్తుంటే మా కష్టం మర్చిపోయాం. ఇలాగే కొత్త వారిని ఎప్పుడూ సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నాము. అమెజాన్ లో మా సినిమాను చూడండి అందరికి షేర్ చెయ్యండి. అమెజాన్ లాంటి పెద్ద సంస్థ మా సినిమాను తీసుకోవడం సంతోషంగా ఉంది” అని హీరో ఆర్యన్ గౌర, డైరెక్టర్ దీపిక అన్నారు.