Sourav Ganguly: దాదా స్టెప్పులేస్తే అట్లుంటది మరి.. కుటుంబ సభ్యులతో లండన్ వీధుల్లో గంగూలీ.. వీడియో వైరల్

సౌరవ్ గంగూలీ శుక్రవారం తన 50వ పుట్టినరోజును జరుపుకున్నారు. లండన్ వీధుల్లో భార్య డోనా, కుమార్తె సనా, తన స్నేహితులతో కలిసి గంగూలీ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

Sourav Ganguly: దాదా స్టెప్పులేస్తే అట్లుంటది మరి.. కుటుంబ సభ్యులతో లండన్ వీధుల్లో గంగూలీ.. వీడియో వైరల్

Ganguly

Sourav Ganguly: టీమిండియాను కొత్తపుంతలు తొక్కించి క్రికెట్ ప్రపంచంలో అగ్రభాగాన నిలిపిన వారిలో సౌరబ్ గంగూలీ ఒకరు. గంగూలీ కెప్టెన్‌గా టీమిండియాకు బలమైన లైనప్ ను నిర్మించగలిగారు. ఆయన నాయకత్వంలో 2001-2002 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. టీమిండియా గొప్ప కెప్టెన్లు ఎవరంటే అప్పుడు, ఇప్పుడు క్రికెట్ అభిమానుల నుండి గంగూలీ పేరు తప్పనిసరిగా వినిపిస్తుంది. ప్రస్తుతం గంగూలీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ప్రెసిడెంట్ గానూ కొనసాగుతున్నాడు. గంగూలీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sourav Ganguly: వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్‌ నిర్వహిస్తాం

సౌరవ్ గంగూలీ శుక్రవారం తన 50వ పుట్టినరోజును జరుపుకున్నారు. లండన్ వీధుల్లో భార్య డోనా, కుమార్తె సనా, తన స్నేహితులతో కలిసి గంగూలీ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. బాలీవుడ్ సంగీతానికి స్టెప్పులు వేశాడు. తొలుత గంగూలీ, అతని స్నేహితులు స్టెప్పులు వేస్తూ ఉండగా కూతురు సనా ఫుట్ పాత్ పై కూర్చొని ఉంది. వెంటనే గంగూలీ కూతుర్ని చేయిపట్టుకొని రోడ్డుపైకి తీసుకొచ్చి ఆమెతో కలిసి స్టెప్పులు వేయడం వీడియోలో కనిపించింది. భార్య, కూతురు, స్నేహితులో కలిసి గంగూలీ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు ‘ దాదా హ్యాపీ బర్త్ డే’ అంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

గంగూలీ టీమిండియా తరపున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 18,575 పరుగులు చేశాడు. అతను అన్ని ఫార్మాట్లలో 195 మ్యాచ్‌లలో టీమిండియాకు నాయకత్వం వహించాడు. వాటిల్లో 97 మ్యాచ్‌లను గెలుచుకోగలిగాడు. 1996 వేసవిలో ఇంగ్లండ్‌పై గంగూలీ తన టెస్టు అరంగేట్రం చేశాడు. లార్డ్స్‌లో తన తొలి టెస్టులో సెంచరీ సాధించాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ తన రెండో టెస్టులో కూడా సెంచరీ సాధించాడు. దాదా టీమిండియా పగ్గాలు చేపట్టిన కొద్దికాలంలోనే జట్టు దూకుడు ప్రదర్శనకు ఆజ్యంపోశాడు. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ వంటి భావి భారత స్టార్లను తీర్చిదిద్దిన ఘనత దాదాకు దక్కిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు.