దా..దా.. ICC చైర్మన్ రేసులో ముందున్న సౌరవ్ గంగూలీ

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ కన్ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)

  • Published By: naveen ,Published On : May 22, 2020 / 06:40 AM IST
దా..దా.. ICC చైర్మన్ రేసులో ముందున్న సౌరవ్ గంగూలీ

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ కన్ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ కన్ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌ పదవిపై పడింది. చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారిలో గంగూలీ కూడా ఉన్నాడు. ఈ నెలలో ఐసీసీ చైర్మన్ గా శశాంక్ మనోహర్ పదవీ కాలం ముగియనుంది. దీంతో తదుపరి చైర్మన్ ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గంగూలీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఐసీసీ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని చూస్తున్న గంగూలీ ఆ దిశగా పావులు కదుపుతున్నాడు. సభ్య దేశాల మద్దతు కూడగట్టే పనిలో పడ్డాడు. ఇందులో భాగంగా సఫారీలో టి20 సిరీస్‌కు ఓకే చెప్పాడు. 

గంగూలీకి మద్దతు తెలిపిన స్మిత్:
ఐసీసీ చైర్మ‌న్ ప‌ద‌వికి సౌరవ్‌ పేరును ప్రతిపాదించే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇటీవలే ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ గోవర్‌ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, తాజాగా క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) డైరెక్టర్‌ గ్రేమ్‌ స్మిత్‌ కూడా గంగూలీనే సరైన అభ్యర్థి అని బహిరంగంగా చెప్పాడు. ‘ఐసీసీ చైర్మన్‌గా గంగూలీ లాంటి వారుంటే మంచిది. అతను అత్యున్నత స్థాయిలో క్రికెట్‌ ఆడాడు. గంగూలీ వల్ల ఆటకు లబ్ది కలుగుతుంది. అతని నాయకత్వ లక్షణాలు, క్రికెట్‌ పరిజ్ఞానం చైర్మన్‌గా విజయవంతమయ్యేందుకు దోహదం చేస్తాయి’ అని స్మిత్‌ అన్నాడు. 

అనూహ్యంగా రేసులోకి దాదా:
స్మిత్‌తో పాటు సీఈవో జాక్వెస్‌ పాల్‌ కూడా గంగూలీకి మద్దతునిచ్చారు. ప్రస్తుత ఐసీసీ చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ పదవీ కాలం మే నెలతో ముగియనుంది. కరోనా నేపథ్యంలో మనోహర్‌ మరో రెండు నెలల పాటు ఈ బాధ్యతల్ని మోయనున్నారు. ఆయన తర్వాత ఇంగ్లండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డ్‌ మాజీ చైర్మన్‌ కొలిన్‌ గ్రేవ్స్‌ ఐసీసీ చైర్మన్‌ పదవి బరిలో ఉండగా, స్మిత్‌ బహిరంగ మద్దతుతో అనూహ్యంగా గంగూలీ రేసులోకొచ్చాడు.

ఐసీసీ తొలి స్వతంత్ర చైర్మన్ గా 2016లో బాధ్యతలు తీసుకున్నాడు. 2018లో సెకండ్ టర్మ్ కూడా సెలెక్ట్ అయ్యాడు. మూడోసారి(ఇదే చివరిసారి) కూడా పోటీ చేసే అవకాశం ఉన్నా తప్పుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ఐసీసీ చైర్మన్ గా సౌరవ్ గంగూలీ సమర్థవంతమైన అభ్యర్థిగా తెరపైకి వచ్చాడు. జూలైలో ఐసీసీ చైర్మన్ ఎన్నికలు జరుగుతాయి.

Read: అక్టోబర్‌లోనే ఐపీఎల్ మ్యాచ్‌లు..!