Sourav Ganguly: సునిల్ చెత్రికి బదులు నేపాల్ సునీల్‌ను ట్యాగ్ చేసిన గంగూలీ

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తప్పులో వేలేశారు. ఆసియా కప్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్ లో సునీల్ చెత్రి కెప్టెన్సీలో ఆడిన బ్లూ టైగర్స్ జట్టు.. బెర్త్ కన్ఫమ్ చేసుకుంది.

Sourav Ganguly: సునిల్ చెత్రికి బదులు నేపాల్ సునీల్‌ను ట్యాగ్ చేసిన గంగూలీ

Sunil Chetri

 

 

Sourav Ganguly: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తప్పులో వేలేశారు. ఆసియా కప్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్ లో సునీల్ చెత్రి కెప్టెన్సీలో ఆడిన బ్లూ టైగర్స్ జట్టు.. బెర్త్ కన్ఫమ్ చేసుకుంది. గ్రూప్ బీ-మ్యాచ్ లో భాగంగా ఫిలిప్పైన్స్ జట్టును 4-0తో ఓడించి ఫైనల్ కు వెళ్లింది.

చరిత్రలో తొలిసారి ఇండియన్ ఫుట్‌బాల్ టీం వరుసగా రెండుసార్లు ఆసియా కప్‌లో ఫైనల్స్‌కు చేరింది. ఈ సందర్భంగా సౌరవ్ గంగూలీ ట్విట్టర్ లో స్పెషల్ ట్వీట్ చేస్తూ సునీల్ చెత్రిని ప్రశంసించబోయి తప్పు చేశారు.

“ఇండియన్ ఫుట్‌బాల్ 2023 AFC ఆసియా కప్ కు అర్హత సాధించి గొప్ప పనిచేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి ఆధ్వర్యంలో జట్టు గొప్ప పని చేసింది. చక్కటి ప్రదర్శన కనబరిచింది. అంతటి అభిమానుల సందడి మధ్య ఆ ప్రదేశంలో ఘనత సాధించారు” అని గంగూలీ ట్వీట్ చేశాడు.

Read Also: దశాబ్దంలో అద్భుతహ: సునీల్ చెత్రి 53, పీవీ సింధు 5, మేరీ కోమ్ 8

సునీల్ చెత్రిని తప్పుగా ట్యాగ్ చేస్తూ చేసిన గంగూలీ ట్వీట్‌ను అభిమానులు, ఫుట్‌బాల్ ఫాలోవర్లు BCCI ప్రెసిడెంట్ చేసిన తప్పును ఎత్తి చూపారు. తప్పుగా సునీల్ అనే మరో వ్యక్తిని ట్యాగ్ చేయగా.. అతను కూడా సౌరవ్ ఇది సునీల్ చెత్రి కాదు. నేపాల్ సునీల్ అంటూ రిప్లై ఇచ్చాడు.