Sowmya Rao : ఎట్టకేలకు జబర్దస్త్‌కి కొత్త యాంకర్.. అనసూయ, రష్మిలని మరిపిస్తుందా??

అనసూయ వెళ్లిపోవడంతో కొత్త యాంకర్ ని తీసుకొస్తారనుకున్నారు అంతా. కానీ రెండు షోలకి రష్మీనే యాంకర్ గా చేసింది. రష్మీకి కూడా డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో కొత్త యాంకర్ ని...............

Sowmya Rao : ఎట్టకేలకు జబర్దస్త్‌కి కొత్త యాంకర్.. అనసూయ, రష్మిలని మరిపిస్తుందా??

Sowmya Rao as new anchor for Jabardasth

Sowmya Rao :  తెలుగు టెలివిజన్ లో బాగా పాపులర్ అయిన షో జబర్దస్త్. ఎన్నో సంవత్సరాలుగా ఈ షో సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. దీనికి మంచి రేటింగ్ రావడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ ని కూడా మొదలు పెట్టారు. దీనికి కూడా మంచి ఆదరణ వచ్చింది. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే గత కొంతకాలంగా ఈ షోల నుంచి ఎవరో ఒకరు వెళ్లిపోవడం జరుగుతుంది. ముందు జడ్జిగా చేసే నాగబాబుతో మొదలై ఆ తర్వాత చాలా మంది కమెడియన్లు కూడా వెళ్లిపోయారు. మొదటి నుంచి జడ్జిగా ఉన్న రోజా కూడా ఇటీవల మంత్రి పదవి రావడంతో వెళ్ళిపోయింది.

షోలు మొదలుపెట్టిన దగ్గర్నుంచి యాంకర్స్ గా అనసూయ, రష్మీనే చేస్తున్నారు. మధ్యలో కొన్ని రోజులు వాళ్ళిద్దరికీ కుదరనప్పుడు వర్షిణి, విష్ణు ప్రియ కొన్ని ఎపిసోడ్స్ చేశారు. అనసూయ, రష్మీ మాత్ర తమ యాంకరింగ్, గ్లామర్ తో షోకి మరింత అందాన్ని చేకూర్చారు. షో నుంచి ఎవరు వెళ్ళిపోయినా వీళ్లిద్దరు మాత్రం పదేళ్లకు పైగా నాటుకుపోయారు. కానీ ఇటీవల అనసూయ కూడా సినిమాలతో బిజీ అవ్వడంతో జబర్దస్త్ నుంచి తప్పుకుంది.

అనసూయ వెళ్లిపోవడంతో కొత్త యాంకర్ ని తీసుకొస్తారనుకున్నారు అంతా. కానీ రెండు షోలకి రష్మీనే యాంకర్ గా చేసింది. రష్మీకి కూడా డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో కొత్త యాంకర్ ని తీసుకువస్తారని కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. ఈ సారి ఎవర్ని తీసుకొస్తారో అనుకున్నారు. తాజాగా వచ్చిన జబర్దస్త్ కొత్త ఎపిసోడ్ కి ఎట్టకేలకి కొత్త యాంకర్ ని తీసుకొచ్చారు.

Young Heros : నిర్మాతలుగా మారుతున్న యువ హీరోలు..

సౌమ్య రావు అనే అమ్మాయిని కొత్త యాంకర్ గా తీసుకొచ్చారు. పలు తెలుగు, తమిళ్ సీరియల్స్ లో నటించే సౌమ్య జబర్దస్త్ లోకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి ఎపిసోడ్ ప్రోమోలో అయితే పర్వాలేదనిపించింది. కమెడియన్స్ తో కలిసి కౌంటర్లు, యాంకరింగ్ తో ఓకే అనిపించింది. కానీ సీరియల్ యాక్టర్ ని యాంకర్ గా తీసుకొచ్చారంటే సాహసమే అని చెప్పొచ్చు. యాంకరింగ్ తో పాటు అందాల ఆరబోత కూడా చేసిన అనసూయ, రష్మీలకి పోటీగా సౌమ్య అందాలు ఆరబోస్తుందా లేదా చూడాలి. మరి ఇన్నేళ్ళుగా పాతుకుపోయిన అనసూయ, రష్మీలని మరిపిస్తుందా లేక సౌమ్య కొన్ని రోజులు నామ మాత్రంగా చేసి వెళ్లిపోతుందా చూడాలి.