అర్జున్, అను.. చెరోసగం.. హ్యాపీ బర్త్‌డే కాజల్..

కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ‘మోస‌గాళ్లు’ చిత్రం నుండి పోస్టర్‌ విడుదల..

  • Published By: sekhar ,Published On : June 19, 2020 / 06:22 AM IST
అర్జున్, అను.. చెరోసగం.. హ్యాపీ బర్త్‌డే కాజల్..

కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ‘మోస‌గాళ్లు’ చిత్రం నుండి పోస్టర్‌ విడుదల..

మంచు విష్ణు హీరోగా న‌టిస్తోన్న హాలీవుడ్‌-ఇండియ‌న్ ఫిల్మ్ ‘మోస‌గాళ్లు’ షూటింగ్ క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధంలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో పూర్తిగా నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల్లో ఏక కాలంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సునీల్ శెట్టి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌తో చిత్రంలో కీల‌క‌మైన ఐటీ ఆఫీస్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ నిలిచిపోయింది. అయిన‌ప్ప‌టికీ, విష్ణుతో పాటు కాజ‌ల్ అగ‌ర్వాల్ పాల్గొన్న స‌న్నివేశాలు, బాలీవుడ్ స్టార్  సునీల్‌శెట్టితో క‌లిసి చేసిన క్లైమాక్స్ యాక్ష‌న్ సీన్ల‌తో పాటు అధిక శాతం షూటింగ్ పూర్త‌యింది.

Mosagallu

ఇటీవ‌ల ‘మోస‌గాళ్లు’ చిత్రానికి సంబంధించి విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్లకు మంచి స్పంద‌న వచ్చిన విషయం తెలిసిందే. ఆ పోస్ట‌ర్ల‌లో అర్జున్‌గా విష్ణు, అను పాత్ర‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ఏసీపీ కుమార్‌గా సునీల్ శెట్టి క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. తాజాగా కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రయూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో అర్థభాగం మంచు విష్ణు, మరో అర్థభాగం కాజల్ కనిపిస్తున్నారు. పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. హాలీవుడ్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. 

Read: సినీ పరిశ్రమలో మరో విషాదం : దర్శకుడు సచి కన్నుమూత