Food Processing Zones : తెలంగాణలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ది చెందుతోందని, అందుకు అనుగుణంగా పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.

Food Processing Zones : తెలంగాణలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు

Food Processing Zones

Food Processing Zones : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ది చెందుతోందని, అందుకు అనుగుణంగా పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.

ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగాయని కేటీఆర్ అన్నారు. ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతాలైన మహబూబ్ నగర్ లాంటి జిల్లాలు, తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలులు ప్రాజెక్టుల నీటితో కళకళలాడుతున్నాయని చెప్పారు. వ్యవసాయ రంగ అభివృద్ధి భారీగా పుంజుకుందన్నారు. భారతదేశంలో రెండో హరిత విప్లవానికి తెలంగాణ నాంది పలికిందన్నారు. దీంతోపాటు మాంసం, పాల ఉత్పత్తి, మత్స్య రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు.

ప్రస్తుతం పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులకు అవసరమైన డిమాండ్‌ని మార్కెటింగ్ సదుపాయాలను క్రియేట్ చేయాలంటే భారీ ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని రాష్ట్రంలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో స్థాపించాలనుకున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు సుమారు 225 ఎకరాలకు తక్కువ కాకుండా ఒక్కో జోన్‌ను ఏర్పాటు చేసేందు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇక వాటిలో రోడ్లు, మంచి నీరు వంటి మౌలిక వసతులు కల్పించేందుకు చిత్తశుద్దితో పనిచేయాలని అధికారులకు సూచించారు కేటీఆర్.

కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను మాత్రమే ఏర్పాటు చేయకుండా ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ సృష్టించే అవకాశం కలుగుతుందని కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధానంగా పండుతున్న వరితో పాటు, తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న ఆయిల్ ఫామ్ వంటి నూతన పంటల భవిష్యత్ అవసరాలను కూడా ఈ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటులో పరిగణలోకి తీసుకుంటామన్నారు.