Varanasi : వారణాశి నుంచి చెన్నైకి రేపు ప్రత్యేక రైలు-ఒక్కరోజు మాత్రమే

ఉత్తర దేశ యాత్రలకు వెళ్లి అక్కడ వర్షాల వల్ల, ఇతర కారణాల వల్ల చిక్కుకు పోయిన వారిని స్వస్ధలాలకు చేర్చేందుకు ఇండియన్ రైల్వే రేపు ప్రత్యేక రైలు నడుపుతోంది

Varanasi : వారణాశి నుంచి చెన్నైకి రేపు ప్రత్యేక రైలు-ఒక్కరోజు మాత్రమే

Varanasi Special Train

Varanasi :  ఉత్తర దేశ యాత్రలకు వెళ్లి అక్కడ వర్షాల వల్ల, ఇతర కారణాల వల్ల చిక్కుకు పోయిన వారిని స్వస్ధలాలకు చేర్చేందుకు ఇండియన్ రైల్వే రేపు ప్రత్యేక రైలు నడుపుతోంది.  కొద్ది రోజుల క్రితం ఆంధ్ర
తెలంగాణ, కర్ణాటకకు   చెందిన పలువురు యాత్రికులు వారణాశి. గయ వంటి పుణ్య క్షేత్రాలకు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లారు.

వానల వలన కానీ, ఇతర కారణాల వల్లకానీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రైళ్లు రద్దు చేయటం వల్ల పలువురు ప్రయాణికులు అక్కడ చిక్కుకుపోయారు. వారి  గురించి సమాచారం తెలుసుకున్న కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్ రెడ్డి  ఈమేరకు కేంద్ర రైల్వే మంత్రికి లేఖ రాశారు. ఉత్తరాది రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వారిని స్వస్ధలాలకు చేర్చేందుకు ప్రత్యేక రైలు  వేయాల్సిందిగా ఆయన లేఖలో కోరారు.

దుకు స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు.  ఈరైలు రేపు సోమవారం జూన్ 20వ తేదీ రాత్రి 8 గంటలకు బెనారస్ రైల్వే స్టేషన్ లో బయలుదేరి నాగపూర్, వరంగల్, విజయవాడ మీదుగా బుధవారం ఉదయం 8 గంటలకు చెన్నై సెంట్రల్  చేరుకుంటుంది.

New Project (27)