Sri Lanka Crisis: శ్రీలంకలో అడుగంటిన పెట్రోల్ నిల్వలు.. బంకుల దగ్గరకు రావొద్దని పౌరులకు ఆదేశం
శ్రీలంక తీవ్ర ఆర్ధిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయి ప్రజలు అల్లాడుపోతున్నారు. దీనికి తోడు చమురు నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు విదేశీ మారక నిల్వలు లేవని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.

Sri Lanka Crisis
Sri Lanka Crisis: శ్రీలంకలో ఆకలి కేకలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యావసర ధరలు ఆకాశాన్నితాకడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో శ్రీలంక తీవ్ర ఆర్ధిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయి ప్రజలు అల్లాడుపోతున్నారు. దీనికి తోడు చమురు నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు విదేశీ మారక నిల్వలు లేవని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.
Supreme Court : సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు: సుప్రీం ఆదేశం
దీంతో ప్రజలెవరూ పెట్రోల్ బంకుల దగ్గరకు రావొద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం డీజిల్ నిల్వలు మాత్రమే ఉన్నాయని చెప్పింది. శ్రీలంక సముద్ర తీరంలో చమురు నౌకలు దాదాపు 60 రోజుల నుంచి నిలిచిపోయాయి. గతంలో చేసుకున్న దిగుమతులకు సంబంధించిన బకాయిల బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. పాత బకాయిలు క్లియర్ చేస్తేనే, ప్రెటోల్‌ను దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇస్తామంటూ షిప్పింగ్ కంపెనీ స్పష్టంగా చెప్పిందని సమాచారం. దీంతో పెట్రోల్ అందుబాటులో లేకుండా పోయింది. అందువల్ల ప్రెటోల్ కోసం వాహనదారులు బంకుల వద్ద బారులు తీరొద్దని శ్రీలంక విద్యుత్, ఎనర్జీ మంత్రిత్వ శాఖ కోరింది.
Tamannah Bhatia: తమన్నా డ్రెస్సు.. కళ్లు చెదిరే ధర!
మరోవైపు శ్రీలంకను ఆదుకునేందుకు వరల్డ్ బ్యాంకు ముందుకువచ్చి 160 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేసింది. అయితే ఈ నిధులను ఇంధన కొనుగోళ్లకు వినియోగించే అవకాశం లేదన్నారు శ్రీలంక నూతన ప్రధాని రణిల్ విక్రమసింఘే. ఇప్పటికే భారత్.. ఓ అడుగు ముందుకు వేసి, క్రెడిట్ లైన్ ప్రకటించింది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం కూడా శ్రీలంకను ఆదుకునేందుకు ఆర్థిక సాయం ప్రకటించింది.