Sri Lanka crisis: శ్రీ‌లంక‌లో లీట‌రు పెట్రోలు ధ‌ర‌ రూ.470కి పెంపు

తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీ‌లంక‌లో పెట్రోల్ ధ‌ర‌లు మ‌రింత పెరిగాయి. తాజాగా, పెట్రోలుపై రూ.50 (శ్రీ‌లంక రూపాయిలో), డీజిల్‌పై రూ.60 పెంచారు.

Sri Lanka crisis: శ్రీ‌లంక‌లో లీట‌రు పెట్రోలు ధ‌ర‌ రూ.470కి పెంపు

Petrol Price

Sri Lanka crisis: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీ‌లంక‌లో పెట్రోల్ ధ‌ర‌లు మ‌రింత పెరిగాయి. తాజాగా, పెట్రోలుపై రూ.50 (శ్రీ‌లంక రూపాయిలో), డీజిల్‌పై రూ.60 పెంచారు. ఈ ధ‌ర‌లు ఆదివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి అమ‌ల్లోకి రానున్నాయని శ్రీ‌లంక ప్ర‌భుత్వ రంగ సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేష‌న్ (సీపీసీ) తెలిపింది. దీంతో శ్రీ‌లంక‌లో లీట‌రు పెట్రోలు ధ‌ర రూ.470, డీజిల్ ధ‌ర రూ.460కి పెరిగింది. శ్రీ‌లంక‌లో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచ‌డం రెండు నెల‌ల్లో ఇది మూడ‌వ‌సారి.

Maharashtra: మ‌హారాష్ట్ర ఎమ్మెల్యేల హోట‌ల్ బిల్ మేము క‌ట్టం: అసోం సీఎం

చివ‌రిసారిగా మే 24న పెట్రోలుపై 24 శాతం, డీజిల్‌పై 38 శాతం ధ‌ర‌లు పెంచారు. ఇంధ‌నాన్ని తీసుకొచ్చే నౌక‌లు బ్యాంకింగ్‌తో పాటు ఇత‌ర కారణాల వ‌ల్ల ఆల‌స్యంగా వ‌స్తున్నాయ‌ని సీపీసీ తెలిపింది. వ‌చ్చేవారం బంకుల్లో పెట్రోల్‌, డీజిల్ ప‌రిమితంగా ఉంటుంద‌ని పేర్కొంది. అంతేగాక‌, ప్ర‌స్తుతం పెట్రోలు, డీజిల్ లేని కార‌ణంగా ప్ర‌జ‌లు బంకుల వ‌ద్ద లైన్లు కట్టొద్ద‌ని, క్రూడాయిల్‌తో త‌దుప‌రి నౌక వ‌చ్చే వ‌ర‌కు బంకుల‌ను మూసివేస్తున్నామ‌ని శ్రీ‌లంక ప్ర‌భుత్వం తెలిపింది. శ్రీ‌లంక‌లో 1948లో స్వాతంత్ర్యం వ‌చ్చినప్ప‌టి నుంచి ఎన్న‌డూ ఎదుర్కోనంత సంక్షోభాన్ని ఆ దేశం ప్ర‌స్తుతం ఎదుర్కొంటోంది.