SriLanka: మాల్దీవ్స్ పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు

ఆంటోనోవ్32 అనే మిలిటరీ విమానంలో శ్రీలంకలోని కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఆయన పారిపోయారు. కొలంబో ఎయిర్‌పోర్టులో గొటబయను ఇమ్మిగ్రేషన్ సిబ్బంది దాదాపు 24 గంటలపాటు ఉంచినట్లు సమాచారం. ఆ తర్వాతే ఆయన విమానానికి అనుమతించారు.

SriLanka: మాల్దీవ్స్ పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు

Sri Lanka

SriLanka: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స కుటుంబంతో కలిసి మాల్దీవ్స్ పారిపోయినట్లు ఒక నివేదిక తెలిపింది. నిజానికి బుధవారం గొటబయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. రాజీనామా చేయడానికి ముందే ఆయన మాల్దీవ్స్ వెళ్లిపోయారు. గొటబయతోపాటు ఆయన భార్య, బాడీగార్డ్, మరొకరు లేదా ఇద్దరు సిబ్బంది మాల్దీవ్స్ వెళ్లిపోయారు.

Kadem Project: ప్ర‌మాద‌పుటంచున క‌డెం ప్రాజెక్టు.. రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించిన అధికారులు

ఆంటోనోవ్32 అనే మిలిటరీ విమానంలో శ్రీలంకలోని కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఆయన పారిపోయారు. కొలంబో ఎయిర్‌పోర్టులో గొటబయను ఇమ్మిగ్రేషన్ సిబ్బంది దాదాపు 24 గంటలపాటు ఉంచినట్లు సమాచారం. ఆ తర్వాతే ఆయన విమానానికి అనుమతించారు. నిజానికి ఆయన కమర్షియల్ ఫ్లైట్‌లో దుబాయ్ వెళ్దామనుకున్నారు. కానీ, ఎయిర్‌పోర్టు సిబ్బంది వీఐపీ సర్వీసుల్ని రద్దు చేశారు. దీంతో ఆయన సాధారణ ప్రజలతోపాటు పబ్లిక్ కౌంటర్స్ ద్వారా విమానంలో ప్రయాణించాల్సి ఉంది. ప్రజల మధ్యలోంచి వెళ్తే ప్రజలు తిరగబడే అవకాశం ఉంది.

NASA: విశ్వ‌రూపం అద్భుతం.. వెలుగులోకి 1300 కోట్ల ఏళ్ల నాటి అద్భుత దృశ్యాలు

ఇది ప్రమాదకరమని భావించిన ఆయన ఎయిర్‌పోర్టు సిబ్బందిని ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వీఐపీ సర్వీసులకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో యూఏఈకి చెందిన నాలుగు విమానాలు వెళ్లిపోయాయి. విమాన ప్రయాణం కుదరని పక్షంలో సముద్ర మార్గంలో కూడా వెళ్లాలని ఆయన ఆలోచించారు. చివరకు మిలిటరీ విమానంలో మాల్దీవ్స్ వెళ్లిపోయారు. అక్కడ భద్రత మధ్య ఒక రహస్య స్థావరానికి ఆయన వెళ్లిపోయారు.