Sri Lanka: పెట్రోలు కోసం నాలుగు రోజులుగా క్యూలోనే.. వ‌ర్క్ ఫ్రం హోం మాత్రమే చేయాలన్న ప్ర‌భుత్వం

ఆర్థిక, ఆహార సంక్షోభం ఎదుర్కొంటోన్న శ్రీ‌లంక‌లోని ప్ర‌జ‌ల‌కు పెట్రోలు, డీజిల్ దొర‌క‌డం గ‌గ‌న‌మైపోయింది. ఇంధ‌న కొర‌త‌తో త‌ల్ల‌డిల్లిపోతోన్న శ్రీ‌లంక‌లో ప‌రిమిత సంఖ్య‌లో వాహ‌న‌దారుల‌కు పెట్రోలు, డీజిల్ అందిస్తున్నారు.

Sri Lanka: పెట్రోలు కోసం నాలుగు రోజులుగా క్యూలోనే.. వ‌ర్క్ ఫ్రం హోం మాత్రమే చేయాలన్న ప్ర‌భుత్వం

Srilanka

Sri Lanka: ఆర్థిక, ఆహార సంక్షోభం ఎదుర్కొంటోన్న శ్రీ‌లంక‌లోని ప్ర‌జ‌ల‌కు పెట్రోలు, డీజిల్ దొర‌క‌డం గ‌గ‌న‌మైపోయింది. ఇంధ‌న కొర‌త‌తో త‌ల్ల‌డిల్లిపోతోన్న శ్రీ‌లంక‌లో వాహ‌న‌దారుల‌కు పరిమితంగా పెట్రోలు, డీజిల్ అందిస్తున్నారు. అందుకోసం ముందుగానే టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది. సోమ‌వారం శ్రీ‌లంక సైన్యం ప్ర‌జ‌ల‌కు టోకెన్లు అందించింది. అలాగే, ఇంధ‌న కొర‌త నేప‌థ్యంలో ఉద్యోగులు అంద‌రూ ఇంటి నుంచే ప‌ని చేయాల‌ని ప్రభుత్వం ఆదేశించింది.

Maharashtra Crisis: మ‌హారాష్ట్ర డిప్యూటీ స్పీక‌ర్‌, సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు

త‌మ నుంచి ఈ విష‌యంపై త‌దుప‌రి ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు ఆ ఆదేశాలు పాటించాల‌ని చెప్పింది. కొలంబోతో పాటు దాని శివారు ప్రాంతాల్లో పాఠ‌శాల‌లు అన్నింటినీ తాత్కాలికంగా మూసివేశారు. దాదాపు వారం రోజుల పాటు వాటిని తెరిచే అవ‌కాశం లేదు. శ్రీ‌లంక ప్ర‌జ‌ల‌ను ఇంధ‌న కొరత ఎంత‌గా వేధిస్తుందో డ‌బ్ల్యూడీ షెల్ట‌న్ (67) అనే ఆటోడ్రైవ‌ర్ తాను ప‌డ్డ క‌ష్టాల గురించి చెప్పింది చ‌దివితే తెలుస్తుంది.

presidential election: నామినేష‌న్ వేసిన య‌శ్వంత్ సిన్హా.. పోటీ రెండు భావ‌జాలాల‌క‌న్న రాహుల్

”నేను నాలుగు రోజులుగా పెట్రోల్ కోసం లైనులో ఉన్నాను. స‌రిగ్గా తిన‌కుండా, నిద్ర‌పోకుండా ఉండాల్సి వ‌చ్చింది. సంపాద‌న కూడా లేకుండాపోయింది. మా కుటుంబాల‌ను పోషించలేక‌పోతున్నాం. ఈ ప‌రిస్థితులు ఇంకా ఎన్నాళ్ళు కొన‌సాగుతాయో” అని షెల్ట‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారం రోజులుగా పెట్రోలు బంకుల వ‌ద్ద అతి భారీగా క్యూలు క‌న‌ప‌డుతున్నాయి. ప్ర‌జా ర‌వాణా, ఆరోగ్య సేవ‌లు, విద్యుత్తు వంటి రంగాలకు మొద‌ట ఇంధ‌నాన్ని అందిస్తున్నారు.