ఆన్‌లైన్‌లో భద్రాచలం రాములోరి కళ్యాణం టిక్కెట్లు

ఆన్‌లైన్‌లో భద్రాచలం రాములోరి కళ్యాణం టిక్కెట్లు

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో రాములోరి కళ్యాణం, పట్టాభిషేకానికి సంబంధించిన టిక్కెట్లను దేవస్థానం ఆన్‌లైన్‌లో ఉంచినట్లుగా వెల్లడించింది. ఏప్రిల్‌ 13వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రాములోరి కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనుండగా.. ఏప్రిల్‌ 21న సీతారాముల కల్యాణం, 22న పట్టాభిషేకం జరుగుతోంది.

శ్రీరామనవమి మహోత్సవాలు తిలకించేందుకు దేవస్థానం ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ విక్రయాలు ప్రారంభించింది. భక్తులు టిక్కెట్లను www.bhadrachalamonline.com వెబ్‌సైట్‌ ద్వారా టిక్కెట్లను విక్రయిస్తోంది దేవస్థానం.

స్వామివారి మహాపట్టాభిషేకం వీక్షించేందుకు రూ.5 వేలు, రూ.2 వేలు, రూ.1116, రూ.500, రూ.200, రూ.100 విలువతో సెక్టార్‌ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నామని దేవాలయ అధికారులు తెలిపారు. ఇతర వివరాలకు 08743-232428 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

20 వేల టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఈఓ వెల్లడించారు. రూ.5 వేల టికెట్‌పై ఇద్దరికి ప్రవేశం కల్పించనున్నట్లు ఆలయ ఈవో శివాజీ తెలిపారు. కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు 15 వేల మందికి ఉచిత ప్రవేశం కల్పిస్తామని వివరించారు.