Srinidhi Shetty: కేజీయఫ్ భామ.. కోబ్రా కోసం బాంబ్ పేల్చిందిగా!

కన్నడలో తెరకెక్కిన కేజీయఫ్, కేజీయఫ్ చాప్టర్2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా.....

Srinidhi Shetty: కేజీయఫ్ భామ.. కోబ్రా కోసం బాంబ్ పేల్చిందిగా!

Srinidhi Shetty Charges Bomb For Vikram Cobra Movie

Srinidhi Shetty: కన్నడలో తెరకెక్కిన కేజీయఫ్, కేజీయఫ్ చాప్టర్2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా నటించిన కన్నడ యాక్టర్ యశ్ ఒక్కసారిగా నేషనల్ స్టార్‌గా మారిపోయాడు. అటు దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాత్రం తన నెక్ట్స్ మూవీ ఏమిటనేది ఇప్పటివరకు ఎవరికీ చెప్పుకురాలేదు.

Srinidhi Shetty: భారీగా పెంచేసి చేతులు కాల్చుకున్న బ్యూటీ!

కాగా, అమ్మడు సైలెంట్‌గా ఉంటూనే తన పని తాను చేసుకుపోయింది. ఇప్పుడు ఏకంగా తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న కోబ్రా సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ మరోసారి తనదైన మార్క్ చూపించబోతున్నాడట. ఈ సినిమాలో ఏకంగా 20 గెటప్స్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు విక్రమ్ సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిందట.

Srinidhi Shetty : నాకు డబ్బే కావాలి అంటున్న KGF హీరోయిన్.. రెమ్యునరేషన్ కూడా పెంచేసి..

కోబ్రా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న శ్రీనిధి శెట్టి ఈ సినిమా కోసం తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా రూ.6-7 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటోందట. కేజీయఫ్ చిత్రంతో పోల్చితే ఇది రెట్టింపు అనే చెప్పాలి. అయితే ఆమెకు ఉన్న డిమాండ్ కారణంగానే ఈ మేర రెమ్యునరేషన్ వసూలు చేస్తోందట ఈ బ్యూటీ. ఇక కోబ్రా సినిమాలో శ్రీనిధి శెట్టి పాత్ర గనక క్లిక్ అయితే, ఆమెకు వరుసగా ఆఫర్లు రావడం మాత్రం ఖాయమని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. ఈ సినిమాను ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.