SSMB28: మహేష్ పిన్నిగా శిల్పాశెట్టి.. త్రివిక్రమ్ స్కెచ్ మాములుగా లేదే!

మాటల మాంత్రికుడి త్రివిక్రమ్ శ్రీనివాస్ అవకాశం ఉంటే తన సినిమాలలో సీనియర్ హీరోయిన్స్ ను ఏ అక్కగానో.. అత్తగానో చేసేస్తుంటాడు. అలానే అత్తారింటికి దారేదిలో నదియా, అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అల వైకుంఠపురములో టబును తీసుకొచ్చాడు. కాగా, ఇప్పుడు మరోసారి మరో క్రేజీ సీనియర్ హీరోయిన్ ను తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది.

SSMB28: మహేష్ పిన్నిగా శిల్పాశెట్టి.. త్రివిక్రమ్ స్కెచ్ మాములుగా లేదే!

Ssmb28 Shilpa Shetty As Mahesh Aunty Trivikram Sketch Is Not Normal

SSMB28: మాటల మాంత్రికుడి త్రివిక్రమ్ శ్రీనివాస్ అవకాశం ఉంటే తన సినిమాలలో సీనియర్ హీరోయిన్స్ ను ఏ అక్కగానో.. అత్తగానో చేసేస్తుంటాడు. అలానే అత్తారింటికి దారేదిలో నదియా, అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అల వైకుంఠపురములో టబును తీసుకొచ్చాడు. కాగా, ఇప్పుడు మరోసారి మరో క్రేజీ సీనియర్ హీరోయిన్ ను తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు శిల్పాశెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అయితే.. శిల్పా చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ తో పాటు వ్యాపార బాధ్యతలను చూసుకుంటుంది.

ఇప్పుడు మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేయాలని చూస్తున్న శిల్పా ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు చేస్తుంది. పనిలో పనిగా టాలీవుడ్ కు కూడా తీసుకొచ్చేందుకు త్రివిక్రమ్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జస్ట్ అనౌన్స్ మెంట్ తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్ శిల్పాశెట్టిని తీసుకొస్తున్నాడని ప్రచారం మొదలవడంతో మరోసారి సోషల్ మీడియాలో అభిమానుల రచ్చ మొదలైంది.

అయితే.. ఇంతకీ శిల్పా పాత్రేంటి అనేది కూడా మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ గా మారింది. త్రివిక్రమ్ రాసుకున్న కథలో శిల్పాశెట్టి క్యారెక్టర్ కి మహేష్ క్యారెక్టర్ కనెక్షన్ ఏమిటంటే.. మహేష్ కి ఆమె పిన్నిగా కనిపించబోతుందట. మహేష్ ఎలా వయసు పెరిగేకొద్దీ మరింత అందంగా కనిపిస్తున్నాడో శిల్పా కూడా అంతే. నిత్యం యోగా.. వర్క్ ఔట్స్ అంటూ సోషల్ మీడియా ద్వారా ఫిట్నెస్ ట్రైనింగ్ కూడా ఇస్తుంటుంది. 45 ఏళ్ల వయసులో కూడా శిల్పా కుర్ర హీరోయిన్స్ కు ఈ మాత్రం తీసిపోదు. మరి సరిగ్గా అదే 45 ఏళ్ల వయసున్న మహేష్ కు పిన్నిగా అంటే త్రివిక్రమ్ ఎలా స్కెచ్ గీశాడో ఏమో చూడాలి!