Deborah Herold: సైక్లింగ్ కోచ్‌పై మరో అథ్లెట్ ఆరోపణలు

తాజాగా ఆర్.కె.శర్మపై మరో మహిళా అథ్లెట్ ఆరోపణలు చేసింది. డెబోరా హెరాల్డ్ అనే అండమాన్‌కు చెందిన సైక్లిస్టు కూడా ఆర్.కె.శర్మ తనను వేధించాడని ఆరోపించింది. శర్మతోపాటు అతడి అసిస్టెంట్ కోచ్ గౌతమణి దేవి తనను కొట్టారని, వేధింపులకు గురి చేశారని డెబోరా వెల్లడించింది.

Deborah Herold: సైక్లింగ్ కోచ్‌పై మరో అథ్లెట్ ఆరోపణలు

Deborah Herold

Deborah Herold: జాతీయ సైక్లింగ్ కోచ్ ఆర్.కె.శర్మపై ఇటీవలే ఒక మహిళా అథ్లెట్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. విదేశాల్లో శిక్షణలో ఉన్న సమయంలో కోచ్ శర్మ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, వేధింపులకు గురి చేశాడని ఒక మహిళా సైక్లిస్ట్ ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ జరిపిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్), సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ)… శర్మను కోచ్ పదవి నుంచి సస్పెండ్ చేసింది. అతడితో ఉన్న కాంట్రాక్టును రద్దు చేసుకుంది.

Presidential Elections: రాష్ట్రపతి ఎన్నిక.. మొదటి రోజు 11 నామినేషన్లు

తాజాగా ఆర్.కె.శర్మపై మరో మహిళా అథ్లెట్ ఆరోపణలు చేసింది. డెబోరా హెరాల్డ్ అనే అండమాన్‌కు చెందిన సైక్లిస్టు కూడా ఆర్.కె.శర్మ తనను వేధించాడని ఆరోపించింది. శర్మతోపాటు అతడి అసిస్టెంట్ కోచ్ గౌతమణి దేవి తనను కొట్టారని, వేధింపులకు గురి చేశారని డెబోరా వెల్లడించింది. అలాగే జట్టులోంచి ఉద్దేశపూర్వకంగానే తొలగించారని చెప్పింది. డెబోరా ప్రస్తుతం సైక్లింగ్‌లో నేషనల్ ఛాంపియన్‌గా ఉంది. ఇంటర్నేషనల్ లెవల్‌లో గోల్డ్ మెడల్ కూడా సాధించింది. ‘‘నేను మరో మహిళా అథ్లెట్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు శర్మ అసిస్టెంట్ కోచ్ దేవి భావించింది. మా స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకుంది. అందుకే ఆమె నన్ను జట్టులోంచి తీసేసేలా చేసింది. ఇతర సైక్లిస్టులకు నన్ను దూరం చేసింది. శర్మ కూడా నన్ను చెంపదెబ్బలు కొట్టారు. నాతో నిర్లక్ష్యంగా, అనుచితంగా ప్రవర్తించారు. ఏళ్ల తరబడి ఇద్దరూ నన్ను వేధించారు’’ అని డెబోరా తెలిపింది.

Donkey Milk Farm: ఐటీ జాబ్ వదిలి గాడిద పాల వ్యాపారం

ఆమె 2012 నుంచి జాతీయ జట్టులో ఉంది. ఈ ఆరోపణలపై అసిస్టెంట్ కోచ్ దేవి స్పందించింది. ఆమెను జట్టులోంచి తొలగించే విషయంలో తాను సొంతంగా ఏమీ చేయలేదని, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సూచించిందే తాను పాటించానని చెప్పింది. కాగా, గతంలో ఎప్పుడూ కోచ్‌పై, అసిస్టెంట్ కోచ్‌పై డెబోరా ఫిర్యాదు చేయలేదని సీఎఫ్ఐ తెలిపింది. జట్టు ఎంపిక విషయంలో ఏ ఒక్కరో సొంతంగా నిర్ణయం తీసుకోలేరని, ప్రతిభ ఆధారంగానే ఎంపిక జరుగుతుందన్నారు.