Rajamouli : స్పెషల్ స్టోరీ.. స్టార్ డైరెక్టర్ రాజమౌళి రెండు దశాబ్దాల ప్రయాణం..

రాజమౌళి.. ఈ పేరు చెబితే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమనే కాదు యావత్ భారత చిత్ర పరిశ్రమ గర్వపడుతుంది. ఒక అసిస్టెంట్ రైటర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా,

Rajamouli : స్పెషల్ స్టోరీ..  స్టార్ డైరెక్టర్ రాజమౌళి రెండు దశాబ్దాల ప్రయాణం..

Student No1

Rajamouli :  రాజమౌళి.. ఈ పేరు చెబితే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమనే కాదు యావత్ భారత చిత్ర పరిశ్రమ గర్వపడుతుంది. ఒక అసిస్టెంట్ రైటర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా, సీరియల్ డైరెక్టర్ గా పని చేసి “‘స్టూడెంట్ నంబర్ 1” చిత్రంతో డైరెక్టర్ గా మారి బాహుబలితో ప్రపంచమంతా తన పేరు వినిపించేలా చేసాడు మన జక్కన్న.

కరెక్టుగా ఇదే రోజు 20 సంవత్సరాల క్రితం అంటే 27/09/2001న రాజమౌళి డైరెక్ట్ చేసిన తొలి సినిమా ”స్టూడెంట్ నంబర్ 1” రిలీజ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, గజాల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 20 సంవత్సరాల క్రితం ఇదే రోజు రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. ఈ సినిమాని స్వప్న సినిమాస్ నిర్మాణ సంస్థ 2 కోట్లతో నిర్మించగా ఆ రోజుల్లోనే 12 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అంతే కాక 42 కేంద్రాల్లో 100 రోజులకి పైగా ఆడి ఘన విజయం సాధించింది. దీంతో తన తొలి సినిమాతోనే రాజమౌళి ఇండస్ట్రీ హిట్ సాధించి తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రయాణాన్ని ఛాలెంజ్ గా ప్రారంభించాడు.

Bandla Ganesh : నన్ను గెలిపిస్తే కెసిఆర్ తో మాట్లాడి 100 ఇళ్ళు కట్టిస్తా.. బండ్లగణేష్

ఆ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ తోటే ”సింహాద్రి” సినిమా తీసి అంతకంటే ఘన విజయం సాధించాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ ని మాస్ హీరోగా నిలబెట్టాడు. ఆ తర్వాత ”సై” అంటూ నితిన్ తో కలిసి సక్సెస్ కొట్టాడు. తర్వాత ప్రభాస్ తో ”ఛత్రపతి” సినిమా తీసి ప్రభాస్ ని స్టార్ హీరోల సరసన నిలబెట్టాడు. తర్వాత రవితేజతో ”విక్రమార్కుడు” సినిమా తీసి తనలో మంచి కామెడీ టైమింగ్ కూడా ఉందని నిరూపించుకున్నాడు.

ఆ తర్వాత మళ్ళీ తనకి లైఫ్ ఇచ్చిన ఎన్టీఆర్ తోటే యముడి గెటప్ వేయించి యమలోకం సృష్టించి అద్భుతమైన గ్రాఫిక్స్ తో ”యమదొంగ” సినిమా తీసి విజయం సాధించాడు. ఆ తర్వాత కమెడియన్ సునీల్ తో ”మర్యాద రామన్న” సినిమా తీసి హిట్ హీరోగా మార్చేశాడు. తర్వాత ”ఈగ”తో కూడా సినిమా తీయగలను అని హిట్ కొట్టి మరీ నిరూపించాడు.

RGV : తెలంగాణ రాజకీయాల్లో ఆర్జీవీ చిచ్చు.. మరో బయోపిక్

ఇక ప్రభాస్, రానాలని పెట్టి ”బాహుబలి” అంటూ రెండు పార్టులుగా సినిమా తీసి ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా సాధించని వసూళ్ళని సాధించి ప్రపంచమంతటా బాహుబలిని రిలీజ్ చేసి అందరితో సాహో అనిపించుకున్నాడు పరాజయమే ఎరుగని డైరెక్టర్ రాజమౌళి. తన అన్ని సినిమాలు ఒక ఎత్తైతే బాహుబలి సినిమా ఒక ఎత్తు.తన అన్ని సినిమాలని ఒక్కొక్క మెట్టుగా మార్చుకొని బాహుబలి సినిమాతో శిఖరం ఎక్కేసాడు రాజమౌళి. ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి ”ఆర్ఆర్ఆర్” అంటూ మరో అద్భుతం సృష్టించబోతున్నాడు జక్కన్న. తన హార్డ్ వర్క్, తన ట్యాలెంట్ తో పరాజయమే లేకుండా వరుస సినిమాలతో 20 ఏళ్లుగా తన ప్రయాణం సాగిస్తున్నాడు.