Heroins : ఇన్‌స్టాగ్రామ్ నుంచి కోట్లలో సంపాదిస్తున్న భామలు

సోషల్ మీడియా మనకైతే ఆనందాలు, ఆలోచనలు, టైం వేస్ట్ చేసేందుకు ఒక వేదిక. కానీ హీరోయిన్స్ కి ఒక్క పోస్టు పెడితే చాలు లక్షల మంది అభిమానుల్నే కాదు, కోట్లు కురిపించే మనీ మెషీన్. ఇన్‌స్టాగ్రామ్ నుంచి చాలా మంది హీరోయిన్స్, సెలబ్రిటీలు కోట్లలో...........

Heroins : ఇన్‌స్టాగ్రామ్ నుంచి కోట్లలో సంపాదిస్తున్న భామలు

star Heroins income from instagram

Heroins :  సోషల్ మీడియా మనకైతే ఆనందాలు, ఆలోచనలు, టైం వేస్ట్ చేసేందుకు ఒక వేదిక. కానీ హీరోయిన్స్ కి ఒక్క పోస్టు పెడితే చాలు లక్షల మంది అభిమానుల్నే కాదు, కోట్లు కురిపించే మనీ మెషీన్. ఇన్‌స్టాగ్రామ్ నుంచి చాలా మంది హీరోయిన్స్, సెలబ్రిటీలు కోట్లలో సంపాదిస్తున్నారు.

సోషల్ మీడియాలో హాట్ ఫోటోస్, టాప్ బ్రాండ్స్ ప్రమోషన్స్ తో రచ్చ లేపుతున్న టాప్ హీరోయిన్స్ ను చూసి నోరెళ్ళబెడుతుంటాం. అసలు ఆ హీరోయిన్స్ అలా ఎందుకు చేస్తున్నారు? ఇలా ఎందుకు చేస్తున్నారంటూ డిస్కషన్స్ పెడుతుంటాం. అయితే వారి ఫోటో షూట్స్ వెనుక కారణం తెలిస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే. ఒక్క పోస్ట్ పెడితే కోట్లు కురుస్తాయి. హాట్ ఫోటో షూట్స్ వెనుక కూడా ప్రొఫెనలిజమ్ చూపడం వాళ్ళకే చెల్లింది. ఇంతకీ సోషల్ మీడియా ద్వారా స్టార్ హీరోయిన్స్ ఎంత అమౌంట్ సంపాదిస్తున్నారో తెలుసా?

బాలీవుడ్ అప్ కమింగ్ టాలెంటెడ్ బ్యూటీస్ లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ముందు వరుసలో ఉంటుంది. మంచి స్టోరీస్ తో సినిమాలు చేయడం, సోషల్ మీడియాలో హాట్ పిక్స్ పోస్ట్ లతో, కమర్షియల్ పోస్టులతో నాలుగు డబ్బులు వెనకేసుకోవడం అమ్మడి వ్యాపకాలు. అయితే తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామర్స్ ఫోటోస్, కమర్షియల్ బ్రాండింగ్ తనకి ఈయమ్ఐలు కట్టుకోడానికి ఎంతో హెల్ప్ అవుతున్నాయని చెబుతోంది జాన్వీ. ఈ ప్రయత్నంలో తను ఫేక్ ఫోటోస్ పెట్టడానికి అసలు ఇష్టపడనని కూడా నిజాయితీగా చెప్పింది. అంతేకాదు తాము హాట్ ఫోటోస్ పెట్టడానికి రీజన్ ఇదే అంటోంది. ఇంతకీ జాన్వీ ఇన్‌స్టా సంపాదన ఎంతో తెలుసా? బ్రాండ్ ను బట్టి ఒకో పోస్ట్ కు 50 లక్షలు చొప్పున ఎర్న్ చేస్తోంది.

మోడ్రన్ డ్రెస్సెస్ లో అందాలన్నీ ఆరబోసి కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేసే సమంతకు సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ లో అయితే సమంత ఫాలోవర్స్ 24 మిలియన్స్ పైనే ఉండటం విశేషం. కాగా, సమంత సోషల్ మీడియా ద్వారా పలు బ్రాండ్స్ ను కూడా ప్రమోట్ చేస్తోంది. ఒక్కో సినిమాకు సమంత రూ. 3.5 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటుందని అందరికీ తెలుసు. అయితే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కూడా సామ్ బాగానే సంపాదిస్తోంది. సమంత నెలకు సోషల్ మీడియా ద్వారా రూ.3 కోట్లకు పైనే సంపాదిస్తు్ండడం విశేషం.

 

బ్యూటిఫుల్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇప్పటికీ బాలీవుడ్ లో లీడింగ్ బ్యూటీనే. ఎప్పటికప్పుడు తన సినిమాలతో ఫ్యాన్స్ సరికొత్తగా ఎంటర్టైన్ చేయాలని తపించే అమ్మడికి సోషల్ మీడియా ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే. ఇన్‌స్టాగ్రామ్ లో అమ్మడికి ఇప్పటికే 66. 3 మిలియన్స్ పైగానే ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె ఎఫిషియన్సీ ఏ పాటితో అర్ధమవుతుంది. సినిమాకి 12 కోట్లు పారితోషికం తీసుకొనే కత్రినా ఇన్‌స్టాగ్రామ్ లో ఒక్కో కమర్షియల్ పోస్ట్ కు దాదాపు కోటి 25 లక్షలు అందుకోవడం ఆమె ఎఫిషియన్సీకి నిదర్శనం.

బాలీవుడ్ అందాల హీరోయిన్స్ లో ఆలియాభట్ చాలా ప్రత్యేకం. ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ కు మతిపోవాల్సిందే. ఆకర్షించే అందంతో పాటు, ఆకట్టుకొనే పెర్ఫార్మెన్స్ అమ్మడి సొంతం. ఎలాంటి పాత్రనైనా తనదైన సిగ్నేచర్ తో నిలబెట్టడం ఆమె స్టైల్. అలాంటి బ్యూటికి సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్ లో ఆలియాకి 68.5 మిలియన్స్ పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఒకో పోస్ట్ కు ఆమె 85 లక్షల నుంచి కోటి వరకూ అందుకుంటోంది. బ్రాండ్ వ్యాల్యూని బట్టి ఆమె అందుకొనే పారితోషికం వ్యాల్యూ కూడా పెరుగుతుంది.

Rashmi Gautam : జబర్దస్త్‌కి కొత్త యాంకర్ వచ్చినా నాకు ప్రాబ్లమ్ లేదు.. సౌమ్యతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు..

బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేస్తూనే తెలుగులోకి ప్రభాస్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది దీపికా పదుకొణే. ఆమె `ప్రాజెక్ట్ K`లో హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్‌ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ భామకి ఇన్‌స్టాగ్రామ్‌లో 67.2 మిలియన్స్ ఫాలోవర్స్ ఉండగా, ఒక్క కమర్షియల్‌ పోస్ట్ కి కోటీ యాభై లక్షలు రెమ్యూనరేషన్‌ తీసుకుంటుండటం విశేషం. ఇలా చాలా మంది హీరోయిన్స్, సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెంచుకుంటూ, ప్రమోషన్స్ చేస్తూ డబ్బులు బాగానే సంపాదిస్తున్నారు.