IT ACTION : ఐటీ రైడ్స్ వెనుక భారీ స్కెచ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే .. స్ట్రైక్ టైమ్ వెరీ ఇంపార్టెంట్ 

ఐటీ అధికారులు రైడ్ చేసినంతగా.. మనకు తెలిసినంత ఈజీగా మాత్రం ఈ దాడులు ఉండవట. ఐటీ రైడ్స్ వెనుక ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలిస్తే.. ఇంత కథ ఉంటుందా? ఆశ్చర్యపోతారు.

IT ACTION : ఐటీ రైడ్స్ వెనుక భారీ స్కెచ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే .. స్ట్రైక్ టైమ్ వెరీ ఇంపార్టెంట్ 

Income tax raids ACTION plan

IT ACTION : మమ్మల్ని టార్గెట్ చేసిన ఐటీ దాడులు చేశారని..ఇది రాజకీయ కక్ష అని రాజకీయ నేతలు ఆరోపణలు చేస్తుంటారు. కానీ ఐటీ రైడ్స్ నిజంగా కక్ష పూరితంగా జరుగుతుంటాయా? ఎవరో చెబితేనే దాడులు చేస్తారా? ఫలానా రాజకీయ నాయకుడో లేక వ్యాపార వేత్త మీదో దాడులు చేయాలి అంటే ఐటీ శాఖకు ఎవరన్నా చెప్పాలా? ఆదేశించాలా? ఇలా ఎన్నో సందేహాలుంటాయి. కానీ నాయకులు ఆరోపించినట్లుగానో.. విమర్శించినట్లుగానో ఉండదట ఐటీ శాఖ పనితీరు. భారత రాజ్యాంగం కల్పించిన స్వతంత్ర వ్యవస్థల్లో ఐటీ డిపార్ట్‌మెంట్ ఒకటిగా ఉన్న ఐటీ శాఖ రాజకీయ కారణాలతో.. కొన్ని దశాబ్దాల కిందట.. మన దేశంలోనే కోరల్లేని పాములా ఉండేది. కానీ.. ఇప్పుడలా కాదు. విశేష అధికారాలతో.. తమ దూకుడుతో ఉంది. ఇటీవల కాలంలో జరుగుతున్న ఐటీ దాడులే దానికి ఉదాహరణగా కనిపిస్తున్నాయి.ఐటీ అధికారులు రైడ్ చేసినంతగా.. మనకు తెలిసినంత ఈజీగా మాత్రం ఈ దాడులు ఉండవట. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలిస్తే.. ఇంత కథ ఉంటుందా? ఆశ్చర్యపోతారు.

ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్.. ముఖ్యంగా అడ్డగోలుగా సంపాదించి.. ప్రభుత్వానికి పన్ను కట్టకుండా దాచుకుంటున్న వారి భరతం పడుతోంది. చాలా మంది అనుకున్నట్లుగా.. రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా.. ఐటీ శాఖ పనితీరు ఉండదు. ఒక్క ఐటీ రైడ్ వెనుక.. భారీ స్కెచ్ దాగి ఉంటుంది. తెలంగాణలో ఐటీ రైడ్స్ హాట్ టాపిక్‌గా మారడంతో.. అందరిలోనూ సోదాలు ఎలా జరుపుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ప్రతి ఐటీ రైడ్‌కంటూ ఓ స్ట్రైక్ టైమ్ అనేది నిర్ధారిస్తారు. వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాల్సినప్పుడు.. ఈ స్ట్రైక్ టైమ్ కచ్చితంగా అంతా పాటించాలి. టార్గెట్‌ నివాసంతో పాటు ఆయన కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, సిబ్బంది ఇళ్లు, ఆఫీసులు, వ్యాపార సంస్థల్లో సోదాలకు.. తెల్లవారుజామున ఐదున్నరకు స్ట్రైక్ టైమ్‌గా నిర్ధారిస్తే.. సరిగ్గా అదే సమయానికి అన్ని చోట్లా రైడ్స్ మొదలవ్వాల్సిందే. అంత కచ్చితంగా జరగాలంటే.. స్ట్రైక్ టైమ్ కంటే కొంత సమయం ముందే ఐటీ బృందాలు సమీప ప్రాంతానికి చేరుకొని ఉంటాయి. అలా చేయకపోతే.. ఒక సమయంలో ఒకచోట సోదాలు జరుగుతుంటే.. విషయం తెలుసుకొని మరో చోట ఉన్నవారు పారిపోవడం గానీ, ఆధారాలు మాయం చేయడం గానీ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల.. ఐటీ సోదాల్లో స్ట్రైక్ టైమ్ అత్యంత కీలకం.

IT Raids Planning : ఐటీ రైడ్స్ అంటే ఆషామాషీ కాదు..దాని వెనుక ఎలాంటి ప్లాన్ ఉంటుందో తెలుసా..?!!

ఐటీ సోదాల సమయంలో మరో కీలక అంశం భద్రత. రైడ్ చేసేందుకు ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత.. ఐటీ శాఖ భద్రతా సిబ్బంది సహకారం తీసుకుంటుంది. గతంలో ఐటీ సోదాలు నిర్వహించే ప్రాంతంలో.. స్థానిక పోలీసుల సహకారం తీసుకునేవారు. ముందుగానే వారికి సోదాలకు సంబంధించిన విషయం చెప్పేవాళ్లు. కొన్ని సందర్భాల్లో.. టార్గెట్‌కు సమాచారం వెళ్లినట్లు గుర్తించారు. దీంతో.. ఐటీ సోదాల సమయంలో స్థానిక పోలీసులు కాకుండా ప్రస్తుతం కేంద్ర బలగాలను తీసుకెళుతున్నారు. దాడులకు కొన్ని గంటల ముందే.. సీఆర్పీఎఫ్ బలగాలు ఐటీ ఆఫీసుకు చేరుకుంటాయ్.

ఒక వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఉద్యోగుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు.. ఐటీ అధికారులు డాట్‌ టూ డాట్‌ విధానాన్ని ఫాలో అవుతారు. టార్గెట్ నుంచి మరో వ్యక్తికి ఉన్న లింకులనే.. డాట్ టూ డాట్ కనెక్షన్ అంటారు. ఒకసారి ఒక విభాగానికి చెందిన వ్యక్తి గానీ, వ్యవస్థపై గానీ రైడ్స్ జరిపితే.. వెంటనే అదే విభాగానికి చెందిన ఇతరులపై ఐటీ సోదాలు చేయదు. దానికి.. కొంత సమయం తీసుకుంటుంది. ఒక రైడ్ తర్వాత.. ఇతర విభాగాలు, రంగాల్లో ఉన్న వ్యక్తులు, సంస్థలపై ఫోకస్ చేస్తుంది. అయితే.. స్థానిక పోలీసులు, సీఐడీ, ఇతర నిఘా విభాగాల్లో ఎక్కడైనా చిన్నపాటి నిబంధనల అతిక్రమణ జరిగే అవకాశం ఉంటుంది గానీ.. ఐటీ శాఖలో మాత్రం కచ్చితంగా రూల్స్ పాటించాల్సిందే.

ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులు కేవలం సోదాలు జరపడం, లెక్కలు సరిచూడటం, లెక్కల్లో లేని బ్లాక్ మనీని, నగలను స్వాధీనం చేసుకోవడం వరకే పరిమితం. అంతకుమించి.. కేసులు నమోదు చేయడం సాధ్యం కాదు. అయితే.. బ్లాక్ మనీకి సంబంధించి పన్ను, ఫైన్ విధించి.. వాటిని వసూలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే.. కోర్టుల్లో కేసులు నమోదు చేస్తారు. ఇక.. జప్తు చేసిన ఆస్తిని.. ఐటీ అధికారులు బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఇందులో.. కమిషనర్‌కు లింక్ చేసిన అకౌంట్స్ ఉంటాయి. అందులో.. సీజన్ చేసిన సొమ్మును డిపాజిట్ చేస్తారు. తర్వాత.. మొత్తం ఆస్తి, ఆదాయం వివరాలను చెక్ చేస్తారు. ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ ఎంత? అనేది లెక్కలేసుకొని.. పన్ను డబ్బులు మినహా మిగతా సొమ్మును తిరిగి చెల్లిస్తారు. అందువల్ల.. ఐటీ సోదాలు పైకి కనిపించేంత సులువుగా ఏమీ జరగవు. ఒక్కో రైడ్‌ వెనుక.. కొన్ని నెలల పాటు పనిచేస్తారు. వాటికి సంబంధించిన సమాచారం.. కొందరు అధికారులకు మాత్రమే తెలుస్తుంది. ఇలా.. ప్రతి రైడ్‌కి సంబంధించి.. అత్యంత గోప్యత, కచ్చితమైన రూల్స్ పాటించడం వల్లే.. ఐటీ రైడ్స్‌లో పెద్ద ఎత్తున నగదు, బంగారం, కీలకమైన పత్రాలు దొరుకుతున్నాయ్.