Telangana: బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ కాన్వాయ్‌పై దాడి.. ఉద్రిక్త‌త‌

బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ కాన్వాయ్‌పై దాడి జ‌రిగింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో గోదావరి ముంపును పరిశీలించడానికి వెళ్లిన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. త‌మ గ్రామంలో నెల‌కొన్న‌ భూ వివాదాన్ని పరిష్కరించకుండా జాప్యం చేస్తున్నార‌ని అర్వింద్‌తో గ్రామ‌స్థులు వాగ్వివాదానికి దిగారు.

Telangana: బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ కాన్వాయ్‌పై దాడి.. ఉద్రిక్త‌త‌

Car

Telangana: బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ కాన్వాయ్‌పై దాడి జ‌రిగింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో గోదావరి ముంపును పరిశీలించడానికి వెళ్లిన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. త‌మ గ్రామంలో నెల‌కొన్న‌ భూ వివాదాన్ని పరిష్కరించకుండా జాప్యం చేస్తున్నార‌ని అర్వింద్‌తో గ్రామ‌స్థులు వాగ్వివాదానికి దిగారు. అక్క‌డ‌ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకోవ‌డంతో గ్రామ‌స్థుల‌ను పోలీసులు పక్కకు తప్పించారు.

srilanka crisis : శ్రీలంకలో ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన ఆ ‘ఆరుగురు’ యువకులు..!

అనంత‌రం అర్వింద్‌ ముంపు ప్రాంతాల వైపున‌కు వెళ్తుండ‌గా తమపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశార‌ని గ్రామస్థులు ఆరోపణ‌లు చేశారు. అర్వింద్‌ను గ్రామ‌స్థులు మరోసారి అడ్డుకుని కాన్వాయ్‌ వెళ్ళ‌నివ్వ‌కుండా చేశారు. దీంతో గ్రామస్థులను పోలీసులు తప్పించి, కాన్వాయ్‌ను ముందుకు పంపించారు. ఆగ్రహంతో ఊగిపోయిన గురైన గ్రామస్థులు కాన్వాయ్‌పై దాడి చేయ‌డంతో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘ‌ట‌న‌ను బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఖండించారు. ఇలాంటి చర్యలు పునరావృతం అయితే దీటుగా సమాధానం చెప్పేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని హెచ్చ‌రించారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు ముక్తకంఠంతో తిరగబడే రోజులు ఆసన్నమయ్యాయిని అన్నారు.