Pushpa Song: పుష్ప పాటకు స్టూడెంట్స్ డ్యాన్స్.. ప్రిన్సిపల్ సస్పెన్షన్

‘పుష్ప’ చిత్రంలోని పాటకు విద్యార్థులు డ్యాన్స్ చేయడంతో, ప్రిన్సిపల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన ఒడిశాలోని గాంజాం జిల్లాలో జరిగింది.

Pushpa Song: పుష్ప పాటకు స్టూడెంట్స్ డ్యాన్స్.. ప్రిన్సిపల్ సస్పెన్షన్

Pushpa Song

Pushpa Song: ‘పుష్ప’ చిత్రంలోని పాటకు విద్యార్థులు డ్యాన్స్ చేయడంతో, ప్రిన్సిపల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన ఒడిశాలోని గాంజాం జిల్లాలో జరిగింది. బారాముండాలి జిల్లాలోని హైస్కూల్‌లో ఇటీవల పదో తరగతి విద్యార్థులకు పరీక్షలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్కూల్‌లోని స్మార్ట్ క్లాస్‌రూమ్‌ను టీచర్లు వాడుకున్నారు. క్లాస్‌లోని స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ద్వారా అనేక అంశాల్ని వివరించారు. అయితే, శిక్షణ అనంతరం క్లాస్‌రూమ్‌కు లాక్ చేయకుండానే టీచర్లు వెళ్లిపోయారు. టీచర్లు వెళ్లిన తర్వాత కొందరు స్టూడెంట్లు తమ మొబైల్ ఫోన్ ద్వారా టీవీకి కనెక్ట్ చేశారు.

Indian Army: రెండు వందల మంది తీవ్రవాదులు చొరబాటుకు సిద్ధం: ఇండియన్ ఆర్మీ

అనంతరం ‘పుష్ప’ చిత్రంలోని పాటను టీవీలో ప్లేచేస్తూ విద్యార్థులు డ్యాన్స్ చేశారు. విద్యార్థుల్లో కొందరు ఈ దృశ్యాలను వీడియో తీశారు. ఆ వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ప్రభుత్వం స్పందించింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు స్కూల్ ప్రిన్సిపల్‌కు జిల్లా యంత్రాంగం షోకాజ్ నోటీసు ఇచ్చింది. అయితే, ప్రిన్సిపల్ ఇచ్చిన సమాధానానికి సంత‌ృప్తి చెందని జిల్లా యంత్రాంగం ఆమెను సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది.