Siddipet: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. ఆసుపత్రిలో విద్యార్థులు

విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచిని సిబ్బంది, పాఠశాలలోనే విద్యార్థులకు చికిత్స అందించారు. అయినప్పటికీ సుమారు 40 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా మారింది. వీరికి తీవ్రమన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు అయ్యాయి.

Siddipet: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. ఆసుపత్రిలో విద్యార్థులు

Siddipet

Siddipet: సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 120 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. అయితే, ఈ విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచిని సిబ్బంది, పాఠశాలలోనే విద్యార్థులకు చికిత్స అందించారు. అయినప్పటికీ సుమారు 40 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా మారింది. వీరికి తీవ్రమన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే పరిస్థితి విషమిస్తోందని గ్రహించిన సిబ్బంది, విద్యార్థులను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

PM Modi: మోదీకి జో బైడెన్ ఆత్మీయ పలకరింపు.. జీ-7 సదస్సులో ఆసక్తికర దృశ్యం

ఘటన సమాచారం తెలిసిన మంత్రి హరీష్ రావు స్పందించారు. విద్యార్థులు పూర్తిగా కోలుకునే వరకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కొందరు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరికొందరు పాఠశాలలోనే చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని తల్లిదండ్రులు చెప్పారు. ఘటనపై స్పందించి, తమ పిల్లలను ఆదుకున్న మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రులు.