COVID-19తో పోరాడటానికి Vitamin D సహకరిస్తుంది!!

  • Published By: Subhan ,Published On : May 9, 2020 / 04:55 AM IST
COVID-19తో పోరాడటానికి Vitamin D సహకరిస్తుంది!!

శరీరంలో విటమిన్-D స్థాయి ఎక్కువ ఉన్న వారిలో కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయే శాతం తగ్గినట్లు వెల్లడైంది. నార్త్ వెస్టరన్ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ లో చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ లో రీసెర్చ్ జరిపారు. 

పలు దేశాల్లో COVID-19తో బాధపడుతున్న పేషెంట్లలో విటమిన్ Dతక్కువగా ఉండటంతో మోర్టాలిటీ రేటుపై ప్రభావం చూపించింది. ఇటలీ, స్పెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్ లలో పేషెంట్ల విటమిన్ డీ స్థాయి చాలా తక్కువగా ఉంది. విటమిన్ D స్థాయి ఎక్కువగా ఉన్న వారిలో ఇమ్యునిటీ సిస్టమ్ ఎక్కువగా పనిచేస్తుంది. 

ఈ స్థాయి తక్కువగా ఉండటం సైటోకిన్ స్టార్మ్ క్రియేట్ చేస్తుంది. ఫలితంగా ఊపిరితిత్తులు డ్యామేజి అవడమే కాక, శ్వాస సంబంధిత సమస్యలు వంటివి జరిగే ప్రమాదం ఉంది.’ అని అలీ దనేష్ఖా రీసెర్చర్ పేర్కొన్నారు. COVID-19 పేషెంట్లలో మెజార్టీగా చనిపోవడానికి ఇదే కారణం. వైరస్ మాత్రమే కాదు వారిని చంపేది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం కూడా ఓ కారణమేనని ఆయన అన్నారు. 

విటమిన్ డీ సప్లిమెంట్లు కూడా తీసుకోవడం మంచిదని సైంటిస్టులు సూచిస్తున్నారు. విటమిన్ డీ అనే మానవ జీవన ప్రమాణాలపై ప్రభావం చూపిస్తుందని మనం తెలుసుకోవాలి.  రోజూ శరీరంలోకి విటమిన్ Dపంపించాల్సిన అవసరం లేదు. తరచుగా స్థాయిని కొనసాగిస్తూ ఉండాలి. కొవిడ్-19పై విటమిన్ D ఎంత ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవాలంటే సైంటిస్టులు మరిన్ని పరిశోధనలు జరపాలి.

Read More:

Covid-19 దెబ్బకు హాస్పిటల్‌లో చేరిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్

* భారత్ లో జూన్-జులైలో కరోనా విశ్వరూపం..ఎయిమ్స్ డైరక్టర్ కీలక వ్యాఖ్యలు