Stop Using Headphones : అదే పనిగా హెడ్‌ఫోన్లను వాడితే శాశ్వతంగా వినికిడి కోల్పోయినట్టే.. తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే..!

Stop Using Headphones : ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎక్కువగా హెడ్‌ఫోన్లు లేదా ఇయర్ ఫోన్లను అతిగా వాడేస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో హెడ్‌ఫోన్ వాడకం అనేది అత్యంత వ్యసనంగా మారిపోయింది. కొంతమంది ఇయర్ ఫోన్లలో మ్యూజిక్ వింటుంటారు..

Stop Using Headphones : అదే పనిగా హెడ్‌ఫోన్లను వాడితే శాశ్వతంగా వినికిడి కోల్పోయినట్టే.. తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే..!

Study shows 1 billion young people are at risk for hearing loss. This is how to prevent it

Stop Using Headphones : ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎక్కువగా హెడ్‌ఫోన్లు లేదా ఇయర్ ఫోన్లను అతిగా వాడేస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో హెడ్‌ఫోన్ వాడకం అనేది అత్యంత వ్యసనంగా మారిపోయింది. కొంతమంది ఇయర్ ఫోన్లలో మ్యూజిక్ వింటుంటారు.. మరికొంతమంది రోజువారీ కార్యకలాపాల కోసం ఇయర్ ఫోన్లను వినియోగిస్తుంటారు. అయితే అదే పనిగా ఎక్కువ గంటలు హెడ్ ఫోన్లను వాడటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయనే విషయం మరిచిపోతున్నారు. యువత దగ్గర నుంచి ప్రతిఒక్కరూ స్మార్ట్ ఫోన్లలో మ్యూజిక్, వీడియోల కోసం హెడ్ ఫోన్లను తెగ వాడేస్తున్నారు.

స్మార్ట్ ఫోన్లకు హెడ్ ఫోన్లు లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదు. టెక్నాలజీపరంగా అనేక ఇయర్ ఫోన్లను మార్కెట్లోకి వచ్చేశాయి. వైర్ లెస్ బ్లూటూత్ ద్వారా పనిచేసే ఎన్నో రకాల మోడల్స్ సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చేశాయి. దాంతో ఇలాంటి హెడ్ ఫోన్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మ్యూజిక్ వినడంతో పాటు జూమ్ కాల్‌లో మాట్లాడేందుకు హెడ్‌ఫోన్ చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు అదే హెడ్‌ఫోన్ చాలామందికి వ్యసనంగా మారింది. హెడ్‌ఫోన్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల అనేక దుష్ప్రభావాలు తప్పవని, వినికిడి సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఓ కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది.

Study shows 1 billion young people are at risk for hearing loss. This is how to prevent it

Study shows 1 billion young people are at risk for hearing loss. This is how to prevent it

అధ్యయనంలో బయపడిన షాకింగ్ వాస్తవాలు..
దీని ప్రకారం.. ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది హెడ్ ఫోన్ల వినియోగంతో వినికిడి లోపం ముప్పు పొంచి ఉంది. BMJ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. స్మార్ట్‌ఫోన్‌లు, మ్యూజిక్, మూవీలను చాలామంది యువకులు ఈ హెడ్ ఫోన్లతో భారీ సౌండ్ పెట్టుకుని మరి ఎక్కువసేపు వినడం సర్వసాధారణంగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 12-34 ఏళ్ల వయస్సు గల 0.67 నుంచి 1.35 బిలియన్ల మంది యూజర్లు పెద్దగా వాల్యూమ్ పెట్టుకుని వింటున్నారని అధ్యయనం అంచనా వేసింది. దీని కారణంగా వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని ప్రధాన అధ్యయన రచయిత లారెన్ డిల్లార్డ్ ఈమెయిల్ ద్వారా వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు సలహాదారుగా ఉన్న డిల్లార్డ్.. చాలా ఎక్కువ వాల్యూమ్‌తో వినడం వల్ల చెవిలోని ఇంద్రియ కణాలు తీవ్రంగా దెబ్బతింటాయని డిల్లార్డ్ చెప్పారు. చాలా కాలం పాటు ఇలానే కొనసాగితే మాత్రం.. చెవులు శాశ్వతంగా దెబ్బతింటాయని, ఫలితంగా వినికిడి లోపం వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని హెచ్చరించారు.

Study shows 1 billion young people are at risk for hearing loss. This is how to prevent it

Study shows 1 billion young people are at risk for hearing loss.

పరిశోధకులు మూడు డేటాబేస్‌లలో 2000, 2021 మధ్య హెడ్‌ఫోన్‌ల వాడకానికి సంబంధించిన డేటాను విశ్లేషించినట్టు అధ్యయనం తెలిపింది. అధ్యయనం ప్రకారం.. హెడ్‌ఫోన్‌ల వాడకంతో పాటు కచేరీలు, బార్‌లు, క్లబ్‌లు వంటి వినోద కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున లౌడ్ స్పీకర్లను వాడటం కూడా ప్రమాదకరమేనని తేలింది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారానికి 40 గంటలకు పైగా సురక్షితమైన శబ్ద స్థాయిలను 85 డెసిబుల్స్‌గా పరిమితం చేసింది. మీరు రోజుకు 2½ గంటలు మాత్రమే వింటున్నట్లయితే.. దాదాపు 92 డెసిబుల్స్‌కు సమానమని అధ్యయనం తెలిపింది. MP3 ఆడియో ఫైల్స్‌తో డౌన్‌లోడ్ చేసిన స్మార్ట్‌ఫోన్లలో మ్యూజిక్ తరచుగా 105 డెసిబెల్‌ల వరకు వాల్యూమ్‌లను యూజర్లు ఎంచుకుంటారు. అదే డీజే ఈవెంట్లలో తరచుగా 104 నుంచి 112 డెసిబుల్స్ వరకు ఉంటాయని అధ్యయనం తెలిపింది. వినికిడి లోపం ముప్పు నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధ్యయన పరిశోధకులు సూచించారు.

మీ డివైజ్‌లో వాల్యూమ్ ఎంతవరకు ఉండాలంటే? :
మీ సొంత డివైజ్‌లో లేదా సంగీత కచేరీలో ఏదైనా మ్యూజిక్ వింటున్నప్పుడు.. వాల్యూమ్ బిగ్గరగా ఉంటే చెవుల్లో ప్రతిధ్వని వినిపిస్తుంది. అంటే.. ఆ స్థాయి సౌండ్ మీ చెవులకు మంచిది కాదని గుర్తించుకోవాలని డిల్లార్డ్ హెచ్చరించాడు. అలాంటి సమయంలో వెంటనే సౌండ్ వాల్యూమ్ కంట్రోల్ చేయడం ద్వారా వినికిడి లోపం కలగకుండా నివారించుకోవచ్చునని ఆయన తెలిపారు. అందుకు చాలా మార్గాలు ఉన్నాయని చెప్పారు. కొన్ని డివైజ్‌లలో సెట్టింగ్‌లలో వాల్యూమ్ లెవల్స్ మానిటరింగ్ చేయవచ్చు. సాధారణంగా మీరు అదేపనిగా చాలా సేపు బిగ్గరగా ఏదైనా మ్యూజిక్ వింటున్నప్పుడు కొందరు మిమ్మల్ని హెచ్చరిస్తుంటారు.

Study shows 1 billion young people are at risk for hearing loss. This is how to prevent it

Study shows 1 billion young people are at risk for hearing loss

అలాగే మీరు డివైజ్‌లోనూ అధిక స్థాయిలో సౌండ్ వింటున్నారని మీ డివైజ్ సైతం అలర్ట్ చేస్తుంది. అప్పుడు వాల్యూమ్ తగ్గించి, తక్కువ సమయం పాటు మ్యూజిక్ వినాలని డిల్లార్డ్ తెలిపారు. ఏ హెడ్‌ఫోన్‌లు వినడానికి సురక్షితమైనవో నిపుణులు కచ్చితంగా చెప్పలేరు. కానీ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గించే వాటిని ఉపయోగించాలని సూచిస్తున్నారు. మీ డివైజ్‌లో వాల్యూమ్‌ను తక్కువ స్థాయిలోపెట్టుకుంటే సరిపోతుంది. కానీ చాలామందికి వాల్యూమ్ డయల్‌పై కంట్రోల్ ఉండదు. మీరు కచేరీ లేదా డీజేల వద్ద ఉన్నట్లయితే.. స్పీకర్లకు మరింత దూరంగా నిలబడండి. తద్వారా మీ వినికిడి లోపం నుంచి మీ చెవులను కాపాడుకోవచ్చునని డిల్లార్డ్ చెప్పారు.

ప్రమాదకరమైన చెవి ఇన్ఫెక్షన్లు ఇవే.. :

* ఇయర్ ఫోన్లు లేదా హెడ్ ఫోన్లను నేరుగా చెవిలోకి పెట్టుకోవడం ద్వారా ఇయర్ కెనాల్ దెబ్బతింటుంది. తద్వారా గాలి వెళ్లే మార్గాన్ని బ్లాక్ చేస్తుంది.

* ఈ బ్లాకేజ్ కారణంగా అనేక రకాల చెవి ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి.

* ఎక్కువ గంటల పాటు చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకుని వినడం ద్వారా చెవిపోటు ఎక్కువగా వచ్చే ప్రధాన సమస్యల్లో ఒకటి.

* అధిక సౌండ్ లెవల్స్ పెట్టుకోవడం అనేది ఎప్పడూ చేయకూడదు. తక్కువ వాల్యూమ్ మాత్రమే ఉండేలా చూసుకోవాలి.

Study shows 1 billion young people are at risk for hearing loss. This is how to prevent it

Study shows 1 billion young people are at risk for hearing loss

* అదే పనిగా తరచుగా ఇయర్ ఫోన్లను వాడటం వల్ల కళ్లు తిరగడం వంటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.

* చెవిలోని ఇన్నర్ ఇయర్ అనేది చాలా సున్నితమైన భాగం.. హెడ్ ఫోన్ల నుంచి అధిక మొత్తంలో ధ్వని వస్తే.. అది దెబ్బతిని వినికిడి కోల్పోయే ప్రమాదం ఉంది.

* లౌడ్ సౌండ్ వినడం ద్వారా సున్నితమైన చెవిలోని కణాలు దెబ్బతిని.. శాశ్వతంగా వినికిడిని కోల్పోతారు.

* చెవుల ద్వారా అధిక స్థాయిలో ధ్వని నేరుగా మెదడుకు చేరుతుంది. తద్వారా నాడి వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. దాంతో దృష్టిలోపంతో పాటు ఏకాగ్రత కోల్పోతారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : PUBG Mobile 2.3 Update : పబ్‌జీ మొబైల్ కొత్త అప్‌డేట్.. ఆకర్షణీయమైన గేమ్‌ప్లేలు ఎన్నో.. వెంటనే గేమ్ అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసుకోండి..!