సామ్ జామ్ షో లో మెరిసిన స్టైలిష్ స్టార్!..

  • Published By: sekhar ,Published On : December 12, 2020 / 05:36 PM IST
సామ్ జామ్ షో లో మెరిసిన స్టైలిష్ స్టార్!..

Stylish Star Allu Arjun – Sam Jam: ఫస్ట్ అండ్ పాపులర్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ సమంతతో ఇటీవల ‘సామ్ జామ్’ పేరిట ఓ స్పెషల్ టాక్ షోను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షోలో సామ్ తనదైన స్టైల్లో పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ.. ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు విజయ్ దేవరకొండ, రానా, నాగ్ అశ్విన్, తమన్నా వంటి సెలబ్స్ పార్టిసిపేట్ చేయగా.. రీసెంట్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు.

అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ షో కోసం ప్రత్యేకంగా సెట్ వేశారు. బన్నీ సూపర్ స్టైలిష్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ షూటింగ్‌కి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

త్వరలో ప్రోమో రిలీజ్ చేయనున్నారు. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలకు సంబంధించి బన్నీ ఎటువంటి ఆసక్తికర విషయాలు చెప్పుంటారా అని ఫ్యాన్స్, ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Allu Arjun