Smartphones: రైతులకు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్

కొత్త ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రాఘవ్ జీ పటేల్ వెల్లడించారు.

Smartphones: రైతులకు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్

Tractor Smartphone

Smartphones: కొత్త ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రాఘవ్ జీ పటేల్ వెల్లడించారు. గాంధీనగర్ లో మంగళవారం జరిగిన ప్రెస్ కాన్ఫిరెన్స్ లో ఈ విషయాన్ని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకుగానూ బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ కొందరు చెప్తున్నారు.

రూ.15వేలు అంతకంటే తక్కువ ధరకు కొనుగోలు చేసే ఫోన్లకు ప్రొడక్ట్ పై రూ.6వేల వరకూ డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో 10శాతం అంటే రూ.1500మాత్రమే ఇచ్చేవారు. జనవరి 17 తర్వాత ఈ బెనిఫిట్ కోసం 12వేల 421మంది రైతులు i-Khedut పోర్టల్ లో రిజిష్టర్ చేసుకున్నారు.

సెప్టెంబర్ 2021న మాజీ సీఎం విజయ్ రూపాణి స్థానాన్ని భూపేంద్ర పటేల్ భర్తీ చేశారు. ఆ తర్వాత రైతులు ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం చేశారు కూడా. అంతేకాకుండా ట్రాక్టర్ కొనుగోలు సమయంలో 25శాతం రాయితీ అంటే రూ.60వేల నుంచి రూ.75వేల వరకూ అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ లో రూ.15 వేలలోపు స్మార్ట్ ఫోన్స్

వర్షపాతం కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, దీని కోసం ప్రభుత్వం రూ.547కోట్లు నష్టపరిహారంగా విడుదల చేసిందని అన్నారు. ఇప్పటి వరకూ రూ.442.31కోట్లు డబ్బును 2.21లక్షల రైతులకు అందజేశారు.