Ram Charan-Shankar Film: క్రేజీ ప్రాజెక్టు కోసం సుదీప్ నిజమేనట!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తమిళ దర్శకుడు శంకర్ సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే నటీనటుల ఎంపిక మొదలుపెట్టిన శంకర్ తెలుగుతో పాటు ఇతర బాషల నటీనటులను ఈ సినిమా కోసం తీసుకొచ్చి పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ లుక్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

Ram Charan-Shankar Film: క్రేజీ ప్రాజెక్టు కోసం సుదీప్ నిజమేనట!

Ram Charan-Shankar Film: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తమిళ దర్శకుడు శంకర్ సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే నటీనటుల ఎంపిక మొదలుపెట్టిన శంకర్ తెలుగుతో పాటు ఇతర బాషల నటీనటులను ఈ సినిమా కోసం తీసుకొచ్చి పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ లుక్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇతర ఇండియన్ బాషల నుండి నటులతో సంప్రదింపులు మొదలుపెట్టారని ఆ మధ్య వినిపించింది. ముఖ్యంగా ఇందులో 30 నిమిషాల నిడివి కలిగిన ఓ పవర్ ఫుల్ పాత్ర ఉందని ప్రచారం జరుగుతుంది.

ఈ పాత్ర కోసం బిగ్ స్టార్ అయితేనే సినిమా స్థాయి పెరుగుతుందని ఆలోచనలో ఉన్న శంకర్ అన్ని బాషల నుండి బిగ్ స్టార్స్ ను ఈ సినిమా కోసం సంప్రదింపులు జరుపుతున్నాడు. కన్నడలో స్టార్ హీరో సుదీప్ కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తున్న సుదీప్ పాత్ర నచ్చితే ఇతర బాషలలో కూడా నటిస్తుంటారు. ఇప్పటికే తెలుగు సినిమాలలో ఆయన చేసిన పాత్రలకు మంచి పేరు దక్కింది. రామ్ చరణ్ సినిమాలో సుదీప్ నటించనున్నారని ఈ మధ్య ప్రచారం జరిగింది. అది నిజమేనని స్వయంగా సుదీప్ ఓ కన్నడ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

కాగా, ఇదే పాత్ర కోసం హిందీలో సల్మాన్, తమిళంలో విజయ్ సేతుపతిని నటింపజేసే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు శంకర్. కండల వీరుడు సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ తో ఎంతో సన్నిహితంగా ఉంటారు. మరోవైపు శంకర్ అంటే బాలీవుడ్ లో కూడా మంచి క్రేజే ఉంది. ఈక్రమంలోనే హిందీ వెర్షన్ కు సల్మాన్ తో సంప్రదింపులు చేస్తున్నారట. కాగా, తెలుగులో ఇదే పాత్ర కోసం చిరంజీవి లేక ఆ పాత్రలో కూడా రామ్ చరణ్ మరో షేడ్ లో కనిపించే అవకాశం ఉందని వినిపిస్తుంది. మరి ఈ సంప్రదింపులు ఎంతవరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.