జ్వరం, జలుబు, దగ్గు ఉంటే ఆఫీస్‌కు రావొద్దు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు

కేంద్ర ప్రభుత్వం.. అధికారులకు, సిబ్బందికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు గైడ్‌లైన్స్‌ విడుదల

  • Published By: naveen ,Published On : June 9, 2020 / 07:11 AM IST
జ్వరం, జలుబు, దగ్గు ఉంటే ఆఫీస్‌కు రావొద్దు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు

కేంద్ర ప్రభుత్వం.. అధికారులకు, సిబ్బందికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు గైడ్‌లైన్స్‌ విడుదల

కేంద్ర ప్రభుత్వం.. అధికారులకు, సిబ్బందికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు గైడ్‌లైన్స్‌ విడుదల చేసిన కేంద్రం.. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే విధులకు హాజరుకాకూడదని సూచించింది. ఇక కంటైన్మెంట్‌ జోన్‌ పరిధిలో ఉన్న ఉద్యోగులు ఇంట్లోనే ఉండాలని తెలిపింది. ఒక్కో విభాగంలో రోస్టర్‌ పద్ధతిలో 20 మంది సిబ్బందినే అనుమతించాలంది. ఇక సెక్రటరీ స్థాయి అధికారులు రోజు విడిచి రోజు హాజరుకావాలని కేంద్రం చెప్పింది.

దేశవ్యాప్తంగా కోవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది మోడీ సర్కార్. మళ్లీ వర్క్‌ ఫ్రం హోం ప్రారంభిస్తున్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంగళవారం(జూన్ 9,2020) తెలిపింది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారికి మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతినిస్తున్నట్టు, మిగతావారు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. కంటైన్‌మెంట్ జోన్ పరిధిలో ఉన్న ఉద్యోగులు ఇంట్లో నుంచే పనిచేయాలని చెప్పింది. జ్వరం, దగ్గు లక్షణాలు ఉంటే ఆఫీసులకు రావద్దని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. తమను తాము కాపాడుకొని, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉద్యోగులంతా తాజా మార్గదర్శకాలను తప్పక పాటించాలని కేంద్రం చెప్పింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు
* జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉంటే ఆఫీసులకు రావొద్దు
* పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారికి మాత్రమే ఆఫీసుల్లోకి అనుమతి, మిగతావారు వర్క్ ఫ్రమ్ హోమ్
* కంటైన్ మెంట్ జోన్ పరిధిలో ఉన్న వారికి వర్క్ ఫ్రమ్ హోమ్
* ఒక్కో విభాగంలో రోస్టర్‌ పద్ధతిలో 20 మంది సిబ్బందికే అనుమతి
* సెక్రటరీ స్థాయి అధికారులు రోజు విడిచి రోజు హాజరుకావాలి
* అలాగే ఎదురెదురుగా కూర్చోవద్దు, ఇంటర్ కాం లోనే మాట్లాడుకోవాలి
* మాస్కు, ఫేస్ షీల్డ్ తప్పనిసరి
* మాస్కు పెట్టుకోకుంటే క్రమశిక్షణ చర్యలు
* వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలు నిర్వహించాలని ఆదేశం
* కామన్ ఏరియాలో ప్రతి గంటకోసారి శుభ్రం చేయాలి
* కంప్యూటర్ కీబోర్డులు ఎవరివి వారే శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి.

24 గంటల్లో 9వేల987 కరోనా కేసులు, 331మరణాలు:
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. వారం రోజులుగా దేశంలో నిత్యం రికార్డు స్థాయిలో 9వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24గంటల్లో అత్యధికంగా 9వేల 987 కేసులు బయటపడ్డాయి. దేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చాక ఒక రోజు వ్యవధిలో అత్యధిక కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో కొవిడ్-19 మహమ్మారికి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. తాజాగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 331మంది మరణించారు. ఒకేరోజు ఈ స్థాయిలో మరణాలు సంభవించడం కూడా ఇదే తొలిసారి. మంగళవారం(జూన్ 9,2020) ఉదయానికి దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 2,66,598కి చేరింది. ఇప్పటివరకు 7వేల 466మంది కరోనాతో చనిపోయారు. మొత్తం బాధితుల్లో 1,29,215 మంది కోలుకున్నారు. మరో 1,29,917 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కరోనా కేసుల్లో 5వ స్థానం, మరణాల్లో 12వ స్థానం:
లాక్ డౌన్ లో నిబంధనలు సడలించిన తర్వాత దేశంలో కరోనా తీవ్రత పెరిగింది. గత వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా 67వేల పాజిటివ్ కేసులు నమోదుకావడంతోపాటు 1868 మంది మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక తీవ్రత కొనసాగుతున్న దేశాల్లో భారత్ 5వస్థానంలో ఉంది. మరణాల సంఖ్యలో 12వ స్థానంలో కొనసాగుతోంది.

Read: లక్షణాల్లేకుండా వైరస్ ఉండడం చాలా అరుదు: WHO