Armpits Itching : చంకల్లో దురద సమస్యతో బాధపడుతున్నారా…ఏం చేయాలంటే?

దద్దుర్లు ఉన్న ప్రదేశంలో కొంచెం కొబ్బరి నూనె రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తూ ఉండాలి. కొబ్బరి నూనె మాయిశ్చ‌రైజ‌ర్‌లా పనిచేస్తుంది. కొబ్బరి నూనెల

Armpits  Itching : చంకల్లో దురద సమస్యతో బాధపడుతున్నారా…ఏం చేయాలంటే?

Armpits Itching : చర్మంపై చాలా మందికి అనేక చోట్ల సహజంగానే దురదలు వస్తుంటాయి. కొందరికి కొన్ని భాగాల్లో దద్దుర్లు వచ్చి చర్మం ఎర్రగా మారుతుంది. అయితే కొందరికి చంకల్లో ఎప్పుడూ దురదగా ఉంటుంది. అందుకు పలు కారణాలు ఉన్నాయి. బిజీ లైఫ్​. పని ఒత్తిడి అధికంగా కావటంతో చాలా మంది ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వల్ల చంకల్లో దురద వస్తుంది. దురద నుండి ఉపసమనం పొందేందుకు గోక్కోవటం అలవాటుగా మారుతుంది. ఇలా చేయటం వల్ల సమస్య మరింత జఠిలమై చంకభాగాల్లో దద్దుర్లు ఏర్పడుతాయి. కొన్ని సందర్భాల్లో చంకల్లో చర్మం రాపిడికి గురవుతుంది. దీంతో దురద వచ్చే అవకాశం ఉంటుంది.

మరి కొంత మందిలో చర్మ వ్యాధులు,గజ్జి, తామర వల్ల కూడా చంకల్లో దురద పుడుతుంది. కొందరికి పొడి చర్మం కారణంగా ఈ సమస్య వస్తుంది. ఈ విధంగా చంకల్లో దురద పెట్టేందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఈ సమస్య ఉన్నవారు వెల్లుల్లి, ఉల్లిపాయ, గోంగూర, వంకాయ వంటి ఆహారాలను కొన్ని రోజులు మానేయాలి. ఇవి అలర్జీ వంటి రియాక్షన్లను కలగజేసి దురద వచ్చేలా చేయాలి. అలాగే కోడిగుడ్లు, చికెన్‌, చేపలను తిన్నా ఇలా జరుగుతుంది. కనుక సమస్య తగ్గే వరకు ఈ ఆహారాలను మానేయాలి.

చంకల్లో యాంటీ బాక్టీరియల్‌ సొల్యూషన్‌ను రాయాలి. లేదా వేపాకులను మిశ్రమంగా చేసి దాన్ని రాసి కొంతసేపు అయ్యాక స్నానం చేయాలి. దీంతో దురదలు రావు. చంకలకు గాలి తగిలేలా వదులైన దుస్తులను ధరించాలి. మట్టిని పట్టుకున్నా, జంతువులు, మొక్కలతో గడిపినా వెంటనే చేతులను హ్యాండ్‌ వాష్‌తో శుభ్రం చేసుకోవాలి.

దద్దుర్లు ఉన్న ప్రదేశంలో కొంచెం కొబ్బరి నూనె రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తూ ఉండాలి. కొబ్బరి నూనె మాయిశ్చ‌రైజ‌ర్‌లా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ మైక్రోబియ‌ల్ లక్షణాలు ఉండుట వలన దురదను తగ్గించి దద్దుర్ల మంటను తగ్గిస్తుంది.అయితే ఆర్గానిక్ కొబ్బరినూనెను మాత్రమే ఉపయోగించాలి.

మార్కెట్‌లో కొన్ని రకాల యాంటీ కాఫింగ్‌ పౌడర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని రోజూ వాడితే సమస్య తగ్గుతుంది. రోజూ రెండు సార్లు స్నానం చేయాలి. మెడికేటెడ్‌ సబ్బులతో శరీరాన్ని రుద్దుకుని స్నానం చేయాలి. ఇతరులకు చెందిన టవల్స్‌, దువ్వెనలు, దుస్తులను వాడరాదు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. రోజు రెండు పూటలా స్నానం చేయాలి. ఈ విధంగా సూచనలు పాటిస్తే చంకల్లో దురదను తగ్గించుకోవచ్చు