Suhana Khan: షారుఖ్ కూతురు.. అమితాబ్ మనవడు.. శ్రీదేవి కూతురు!

బిగ్ బీ.. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవడు.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమార్తె ఎంట్రీకి రంగం సిద్దమైందా అంటే బాలీవుడ్ అవుననే సమాధానమిస్తుంది. హీరో షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా..

Suhana Khan: షారుఖ్ కూతురు.. అమితాబ్ మనవడు.. శ్రీదేవి కూతురు!

Suhana Khan: బిగ్ బీ.. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవడు.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమార్తె ఎంట్రీకి రంగం సిద్దమైందా అంటే బాలీవుడ్ అవుననే సమాధానమిస్తుంది. హీరో షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ లండన్‌లో చదువు పూర్తి చేసుకుంది. సుహానా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు చాలాకాలంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆమెకు మంచి క్రేజ్‌ ఉంది. ఇక ఇప్పుడు సుహానా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు కనిపిస్తుంది. షారుఖ్ కూడా గతంలో తన కూతురు హీరోయిన్ కావాలనుకుంటోందని చెప్పేశాడు.

Ashu Reddy: అషుకి లైవ్‌లో ఫోన్ నెంబర్ ఇచ్చిన నెటిజన్.. తర్వాత ఏమైందంటే?

కాగా, తాజాగా సుహానా ఖాన్ బాలీవుడ్ దర్శకురాలైన జోయా అక్తర్ ఆఫీస్‌కు వెళ్లింది. సినిమాకు సంబంధించిన చర్చలు జరపడం కోసమే సుహానా జోయా ఆఫీస్ కు వెళ్లినట్లుగా బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జోయా కార్యాలయాన్ని సుహానా సందర్శించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారగా.. ఈ టాపిక్ బాలీవుడ్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. జోయా సినిమాలో మరో ఇద్దరు బాలీవుడ్ సెలబ్ కిడ్స్ కూడా రంగప్రవేశం చేయనున్నారని టాక్ నడుస్తుంది.

Sarkaru Vaari Paata: ముహూర్తం పెట్టేసిన మహేశ్.. వాలంటైన్స్ డే రోజున ఫస్ట్ సింగిల్

జోయా తెరకెక్కించే ఈ సినిమాలో సుహానా ఖాన్‌తో పాటు శ్రీదేవి కూతురు ఖుషి కపూర్, అమితాబ్ బచ్చన్ కుమార్తె కుమారుడు అగస్త్య నంద కూడా కనిపించబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ‘అర్చీస్’ కామిక్స్‌ను రీమేక్ చేస్తున్నామని గతంలోనే జోయా అక్తర్ ప్రకటించగా.. ఇప్పుడు ఈ కామిక్స్ కోసమే సుహానా, ఖుషీ కపూర్, అగస్త్య నందలను ఎంచుకున్నట్లుగా బీ టౌన్ లో టాక్ నడుస్తుంది.