‘రిస్క్ చేస్తేనే డబ్బులొస్తయ్.. దేవుడికి దణ్ణం పెట్టుకుంటే రావు’.. ఆకట్టుకుంటున్న ‘సూపర్ ఓవర్’..

10TV Telugu News

Super Over: సరికొత్త కంటెంట్‌తో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్‌తో రోజురోజుకీ ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’. ఇటీవల పలు భాషలకు చెందిన సూపర్ హిట్ సినిమాలతో పాటు మంచి వెబ్ సిరీస్‌ అందిస్తూ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్న ‘ఆహా’ లో ‘సూపర్ ఓవర్’ అనే మరో డిఫరెంట్ మూవీ రాబోతోంది.

నవీన్ చంద్ర, చాందిని చౌదరి, ప్రభు, అజయ్, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో నటించగా ప్రవీణ్ వర్మ దర్శకత్వంలో సుధీర్ వర్మ నిర్మించారు. ఈ మూవీ స్నీక్-ప్రీక్ తాజాగా యంగ్ హీరో శర్వానంద్ రిలీజ్ చేశారు. ‘సూపర్ ఓవర్’ స్నీక్-ప్రీక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

పోలీస్ స్టేషన్ దగ్గర దొంగతనం ఏంట్రా.. ఎంత రిస్కో తెలుసా?.. లైఫ్‌లో రిస్క్ చేస్తేనే డబ్బులొస్తయ్.. దేవుడికి దణ్ణం పెట్టుకుంటే రావు..’ వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. జనవరి 22 నుంచి ‘ఆహా’ లో ‘సూపర్ ఓవర్’ ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి.

×