Krishna : స్టార్.. స్టార్.. సూపర్ స్టార్.. కృష్ణ పుట్టినరోజు స్పెషల్ స్టోరీ..

తెలుగు ఇండస్ట్రీలో కొన్ని అద్యాయాలు ఎప్పటికీ చెరిగిపోవు అలాంటి ఓ సువర్ణద్యాయమే సూపర్‌స్టార్‌ కెరీర్‌. తెలుగు సినిమాను ప్రయోగాల బాట నడిపించడమే కాదు, ఎన్నో అత్యున్నత సాంకేతిక విలువలను...................

Krishna :  స్టార్.. స్టార్.. సూపర్ స్టార్.. కృష్ణ పుట్టినరోజు స్పెషల్ స్టోరీ..

Krishna

Krishna :  తెలుగు ఇండస్ట్రీలో కొన్ని అద్యాయాలు ఎప్పటికీ చెరిగిపోవు అలాంటి ఓ సువర్ణద్యాయమే సూపర్‌స్టార్‌ కెరీర్‌. తెలుగు సినిమాను ప్రయోగాల బాట నడిపించడమే కాదు, ఎన్నో అత్యున్నత సాంకేతిక విలువలను తెలుగు తెరకు పరిచయం చేసిన సాహసి అతను. తొలి కౌబాయ్‌, తొలి బాండ్‌, తొలి 70MM, తొలి సినిమా స్కొప్‌, లాంటి ఎన్నో సాంకేతికతలను తెలుగు తెరకు పరిచయం చేశాడు. తెలుగు తెరకు తెగువ నేర్పిన సూపర్‌స్టార్‌ కృష్ణ.. 79వ యేట అడుగిడుతున్న సందర్భంగా ఆ నటశేఖరుని కెరీర్‌పై స్పెషల్ స్టోరీ.

సూపర్ స్టార్ కృష్ణ 1943వ సంవత్సరం, మే 31వ తేదీన గుంటూరు జిల్లా, బుర్రిపాలెంలో జన్మించారు. చిన్నప్పటినుంచే నటన మీద ఆసక్తి పెంచుకున్న కృష్ణ చదువుకునే రోజుల్లోనే ఎన్నో నాటకాల్లో నటించారు. ఎన్నో బహుమతులను కూడా గెలుచుకున్నారు. ఆ అనుభవంతోనే 1965లో తొలిసారిగా తేనేమనసులు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. తెలుగులో తొలిపూర్తి స్థాయి కలర్‌ సినిమా కూడా ఇదే. అయితే తొలి రోజుల్లోనే ప్రయోగాలకు సై అన్నాడు కృష్ణ. కెరీర్‌ స్టార్టింగ్‌లోనే గూఢచారి 116 లాంటి స్పై సినిమా చేసి తొలి సారి బాండ్‌ క్యారెక్టర్‌ను తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఈ సినిమాతో మాస్ అండ్‌ యాక్షన్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కృష్ణ.

ఆ తరువాత కృష్ణ చేసిన మరో ప్రయోగం కౌబాయ్‌. తెలుగు నేటివిటికి అసలు సంబందం లేని కౌబాయ్‌ పాత్రతో కూడా సంచలనం సృష్టించాడు కృష్ణ. 1970లో మొసగాళ్లకు మొసగాడు సినిమాతో తెలుగు తెర మీద కౌబాయ్‌ క్యారెక్టర్‌లకు స్వాగతం పలికాడు. తరువాత ఈ సినిమా ఇంగ్లీష్‌లోకి కూడా డబ్‌ అయి హాలీవుడ్‌లో రిలీజ్‌ అయింది.

తెలుగు సినిమాను ఉన్నత స్థితికి తీసుకొచ్చిన మహనీయుల్లో కృష్ణ ముందు వరుసలో ఉంటారంటే అతిశయోక్తి కాదు. తెలుగుతెరపై సాంకేతిక విప్లవకారుడాయన. కృష్ణ అప్పట్లో నాలుగు షిఫ్ట్‌లు పనిచేసేవారు. ఒకే స్టూడియోలో ఎక్కువ ఫోర్లలో ఆయన షూటింగులే జరుగుతుండేవి. కాసేపు నిద్రపోవాలనుకుంటే ‘సార్… మా కాస్ట్యూమ్స్ వేసుకొని పడుకోండి. మా సినిమాలో మీరు నిద్రపోతున్న షాట్స్ కొన్ని ఉన్నాయి. అవి తీసుకుంటాం’ అని దర్శకులు అడిగే స్థాయిలో సాగేది అప్పట్లో కృష్ణ షెడ్యూల్.

కృష్ణ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌ అల్లూరి సీతారామరాజు. ఎన్నో ఎళ్లుగా ఎన్టీఆర్‌ చేయాలనుకుంటూ ఆగిపోతున్న అల్లూరి క్యారెక్టర్లో నటించిన కృష్ణ ఈ సినిమాతో అప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో రికార్డులను తిరగరాశాడు. వీర రసాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఈ సినిమాలో ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటీకీ ప్రేక్షకుల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే వుంటాయి. సొంత బ్యానర్ పై భారీ వ్యయ ప్రయాసలకి ఓర్చి ఆయన నిర్మించిన ఈ సినిమా, సంచలనానికి సరైన అర్ధం చెప్పింది. కృష్ణ పేరు ప్రతిష్టలని ఎవరెస్టు శిఖరమంత ఎత్తులో నిలిపింది.

కృష్ణ కేవలం సాహసానికే కాదు డెడికేషన్‌కు కూడా పెట్టింది పేరు అందుకే ఆయన ఒక టైంలో ఒకే సంవత్సరం 17 సినిమాలు విడుదల చేసి సంచలనం సృష్టించాడు.. అంతేకాదు ఆ 17 సినిమాల్లో 9 సినిమాలు 100 రోజులు ఆడటం మరో విశేషం.. ఇలాంటి అరుదైన రికార్డు తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ప్రపంచ సినీ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాదనటం అతిషయోక్తి కాదు. ఈనాడులో పవర్ ఫుల్ కేరక్టర్ ని పోషించారు. కార్మిక – శ్రామిక పక్షాన నిలిచి అవినీతి రాజకీయాలపై సమర శంఖాన్ని పూరించే శక్తిగా కృష్ణ కనిపిస్తారు. ఈ సినిమాతో జనం మెచ్చిన నటుడుగా నీరాజనాలు అందుకున్న కృష్ణ. ఏకలవ్య, అడవి సింహాలు, ముందడుగు, శక్తి, పచ్చని కాపురం, పల్నాటి సింహం, సింహాసనం.. వంటి చిత్రాలతో ఘన విజయాల్ని అందుకున్నారు.

70, 80లలోనే కాదు 90వదశకంలో కూడా అద్భుతమైన చిత్రాల్లో నటించారు కృష్ణ. నెంబర్‌ వన్‌, అమ్మదొంగా లాంటి సినిమాలతో చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్‌ హీరోలకు కూడా గట్టి పోటినిచ్చారు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా కృష్ణ సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. పద్మాలయ బ్యానర్ పై బాలీవుడ్ చిత్రాలని సైతం నిర్మించిన ఘనత ఆయన సొంతం. నష్టపోయిన నిర్మాతలకు పారితోషికం గురించి పట్టించుకోకుండా మళ్లీ మళ్లీ డేట్స్ ఇచ్చి ఆదుకునేవారాయన. తను నటించే సినిమా భవిష్యత్ గురించి, అది ఆడుతుందా? ఆడదా? కూడా ఆయన నిర్మొహమాటంగా చెప్పేవారు. దాదాపు 350 చిత్రాల్లో నటించిన కృష్ణ నటుడిగా మత్రమే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణించి సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. సినిమాలు ఆపేసిన తర్వాత కూడా కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ వేసి అటు తన అభిమానులను ఇటు సినీ ప్రేక్షకులను అలరించారు సూపర్ స్టార్ కృష్ణ. ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు.

Flop Movies : ఆఫ్టర్ కరోనా.. అటు హిట్ సినిమాలే కాదు.. ఫ్లాప్స్ కూడా ఎక్కువే ఉన్నాయి..

వంద అడుగుల ఎత్తు నుంచి దూకడం, డూప్ లేకుండా పోరాటాలు చేయడం లాంటి సాహసాలు చేశాడు. అసలు ఇతను హీరో ఏంటి? మంచి రంగూ, ఒడ్డూ పొడుగు ఉన్నంత మాత్రన హీరోలైపోతారా అని హేళనగా మాట్లాడిన వారి నోటితోనే హీరోయిజానికి ఇతనే చిరునామా అనేట్లు చేశాడు కృష్ణ. కృష్ణ కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున కృష్ణ జన్మదిన వేడుకల్ని జరుపుకుంటున్నారు.