ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్ ‘మురారి’కి 20 ఏళ్లు..

ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్ ‘మురారి’కి 20 ఏళ్లు..

Murari: సూపర్‌స్టార్ మహేష్ బాబు, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ కాంబినేషన్‌లో రామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్.రామలింగేశ్వరరావు నిర్మించిన బ్లాక్‌బస్టర్ ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్ ‘మురారి’.. 2001 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఫిబ్రవరి 17తో ‘మూరారి’ మూవీ విజయంతంగా 20 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది.

20 Years for Murari

లక్ష్మీ, సుకుమారి, అన్నపూర్ణ, సుధ, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, ప్రసాద్ బాబు, రఘబాబు, రవిబాబు, ప్రకాష్ రాజ్, అచ్చుత్ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమాకి కథ, కథనాలు, ఫ్యామిలీ ఎమోషన్స్, దైవ భక్తి చుట్టూ, ఒక వంశానికి తరతరాలుగా వ్యాపిస్తున్న శాపం వంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా చూపించారు కృష్ణ వంశీ.

 

20 Years for Murari
‘‘అన్నిటికన్నా సంకల్పం గొప్పది.. మనిషి తల్చుకుంటే ఏమన్నా చేయొచ్చు.. తప్పు చేయనంత వరకు దేన్నైనా ఎదిరించొచ్చు’’.. అనే పాయింట్‌ని ఎటువంటి కమర్షియల్ హంగులకు పోకుండా చాలా చక్కగా చూపించారు దర్శకుడు. సూపర్‌స్టార్ పర్ఫార్మెన్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, మెలోడి బ్రహ్మ మణిశర్మ పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్, రామ్ ప్రసాద్ విజువల్స్ సినిమాను వేరే లెవల్‌కి తీసుకెళ్లాయి.

20 Years for Murari

సూపర్‌స్టార్ ఫ్యాన్స్, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ‘మురారి’ సినిమాను బాగా ఆదరించారు. ‘ఈ చిత్ర ప్రారంభాన్ని మిస్ అవ్వకండి’ అప్పట్లో ఇచ్చిన పేపర్ యాడ్ బాగా పాపులర్ అయ్యింది. 71 కేంద్రాలలో 50 రోజులు, 34 కేంద్రాలలో 100 రోజులు, 3 కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శితమై నిర్మాత, బయ్యర్లకు లాభాలు పంచింది ‘మురారి’ చిత్రం.

20 Years for Murari

ఈ చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో సిల్వర్ నంది, బెస్ట్ క్యారెక్టర్ నటిగా లక్ష్మీకి నంది, అవార్డ్ మహేష్ బాబుకు స్పెషల్ జ్యూరీ అవార్డులు వచ్చాయి. మహేష్, దర్శకుడు, నిర్మాత, మహేష్ అభిమానులతో పాటు చక్కటి కుటుంబ కథా చిత్రంగా ‘మురారి’ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.