Rajinikanth : విదేశాలకు రజినీకాంత్.. అభిమానుల్లో ఆందోళన..

సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో సినిమా పరిశ్రమ వారు, అభిమానులు షాకయ్యారు..

Rajinikanth : విదేశాలకు రజినీకాంత్.. అభిమానుల్లో ఆందోళన..

Rajinikanth

Rajinikanth: సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో సినిమా పరిశ్రమ వారు, అభిమానులు షాకయ్యారు. ఇటీవలే అనారోగ్యం నుండి కోలుకున్న రజినీ గురించి ఇలాంటి వార్త ఏంటంటూ కంగారు పడ్డారు.

అయితే రజినీకాంత్ క్షేమంగానే ఉన్నారని తెలిసింది. రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం ఆయన యూఎస్ వెళ్లారట. సోమవారం మధ్యాహ్నం రజినీ 14 సీట్ల కెపాసిటీ కలిగిన స్పెషల్ ఫ్లైట్‌లో కుటుంబసభ్యులతో కలిసి చెన్నై నుండి బయలుదేరారని కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లే వీలు లేదు. అయితే కొద్దిరోజుల క్రితమే అనుమతి కోరుతూ రజినీ సెంట్రల్ గవర్నమెంట్‌కు లెటర్ రాశారని.. అక్కడినుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో అబ్రోడ్ పయనమయ్యారని అంటున్నారు. ఆల్రెడీ అల్లుడు ధనుష్ హాలీవుడ్ మూవీ షూటింగ్ కోసం ఫ్యామిలీతో యూఎస్‌లో ఉన్నారు. రజినీ నటించిన ‘అన్నాత్తే’ దీపావళి కానుకగా విడుదల కానుంది.