దీపావళికి సూపర్‌స్టార్ ‘అన్నాత్తే’

10TV Telugu News

Annaatthe: సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్తే’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘అన్నాత్తే’ ను దీపావళి కానుకగా 2021 నవంబర్ 4 న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

కీర్తి సురేష్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. యూనిట్ సభ్యుల్లో 8 మందికి కరోనా పాజిటివ్ రావడం, రజినీ అనారోగ్యానికి గురవడంతో షూటింగ్ వాయిదా వేశారు. త్వరలో బ్యాలెన్స్ చిత్రీకరణ పూర్తి చేయనున్నారు. ‘అన్నాత్తే’ కు డి.ఇమాన్ సంగీతమందిస్తున్నారు.