No Bail : మీరు కోరే ఆయుర్వేద చికిత్స జైల్లోనే చేయిస్తాం : ఆశారాం బెయిల్ పై సుప్రీం వ్యాఖ్య

బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న బాబాజీ ఆశారాం మధ్యంతర బెయిలును సుప్రీంకోర్టు కొట్టివేసింది.‘మీకు ఆయుర్వేద చికిత్సను జైలులోనే చేయిస్తాం అందిస్తామని పేర్కొంది

No Bail : మీరు కోరే ఆయుర్వేద చికిత్స జైల్లోనే చేయిస్తాం : ఆశారాం బెయిల్ పై సుప్రీం వ్యాఖ్య

Supreme Court Denies Asaram Bail (1)

Supreme Court Denies Asaram Bail : బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న రాజస్థాన్‌కు చెందిన ఆధ్యాత్మిక గురువు  బాబాజీ ఆశారాం మధ్యంతర బెయిలు కోసం వేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. తన ఆరోగ్యం బాగోలేదని..ఆయుర్వేద చికిత్స చేయించుకోవాలని ఆశారాం తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై దేశ అత్యున్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఆశారాం మీరు చేసింది చిన్ననేరం ఏమీ కాదు..ఏ చికిత్స కోసమైతే మీరు బయటకు వెళ్లాలనుకుంటున్నారో..అటువంటి ఆయుర్వేద చికిత్సలన్నింటిని మేం జైలులో మీకు అందేలా చేస్తాం’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

తన ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఆశారాంను 2018లో రాజస్థాన్ జోధ్‌పూర్‌కు కోర్టు దోషిగా తేల్చి..ఆశారాంబాపూకు జీవితఖైదు విధించింది. ఈ క్రమంలో ఆశారాం బెయిల్ పిటిషన్‌కు వ్యతిరేకంగా రాజస్థాన్ ప్రభుత్వం వాదించింది. తన జైలుశిక్షను రద్దు చేయించుకునే ప్రయత్నంలో భాగంగానే ఆశారాంబాపూ ఈ బెయిల్ పిటిషన్ వేశారని రాజస్థాన్ ప్రభుత్వం ఆరోపించింది.

గతంలో కూడా ఆశారాం ఇలాంటి తరహా పిటిషన్లే వేసిన విషయాన్ని సుప్రీంకోర్టుకు రాజస్థాన్ ప్రభుత్వ తరపు న్యాయవాది  గుర్తుచేశారు. జైలులోనే దోషికి అత్యుత్తమ చికిత్స లభిస్తోందని ధర్మాసనానికి వెల్లడిస్తూ..దోషి వేసిన పిటీషన్ కొట్టివేయాలని కోరారు. అదే సమయంలో అత్యున్నత న్యాయస్థానం నియమించిన వైద్యుల కమిటీ అతనికి పరీక్షలు చేసి, ఆశారాంకు ఎటువంటి సమస్యలూ లేవని తేల్చిందని తెలిపింది. ఈ వాదనలన్నీ విన్న సుప్రీంకోర్టు.. ఆశారాం చేసిన నేరం చిన్నదేమీ కాదని వ్యాఖ్యానించింది. ‘‘మీకు కావలసిన ఆయుర్వేద చికిత్స మొత్తం జైల్లోనే చేయిస్తాం’’ అని పేర్కొంటూ బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది.

కాగా..ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ సమీపంలోని ప్రకాశ్ దీప్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద్‌లో చికిత్స పొందుతున్నందుకు తన శిక్షను రెండు నెలల పాటు రద్దు చేయాలంటూ ఆశారాం చేసిన పిటిషన్‌పై జూన్ 4 న వెకేషన్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వ స్పందనను కోరింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆశారాం ఆసుపత్రిలో ఉందని మరియు చికిత్స కోసం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో కూడా ఏర్పాటు చేసినట్లుగా వివరించింది. అలా శిక్ష నుంచి తప్పించుకోవటానికి మరోసారి ఆశారాంబాపూ వేసిన బెయిట్ యత్నాలు ఫలించలేదు. బెయిల్ లభించలేదు.

కాగా..గత మే 6 న ఆశారాంకు కోవిడ్ -19 పాజిటివ్ లక్షణాలు ఉండటంతో ఆయనకు కోవిడ్ పరీక్ష చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని..దాని కోసం చికిత్స కూడా అందించబడింది అని కూడా కోర్టుకు రాజస్థాన్ ప్రభుత్వ న్యాయవాది వివరించారు. ఇలా అన్ని విధాలుగానే ఆయనకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయబడ్డాయని కానీ బెయిల్ సాకుతో ఆశారాంబాపూ జైలుశిక్షను తప్పించుకోవటానికి అన్ని విధాలుగాను యత్నిస్తున్నారని వివరించగా..ఈ వివరణలు అన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఆశారాంబాపూ బెయిల్ పిటీషన్ ను కొట్టివేసింది.