Supreme Court : కరోనా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం ఎంత ఇస్తారో 6 వారాల్లోగా చెప్పాలి

కరోనాతో మృతి చెందినవారి కుటుంబాలకు నష్టపరిహారం ఎంత చెల్లిస్తారో అనే విషయంపై ఆరు వారాల్లోగా నివేదికను రూపొందించి కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది.

Supreme Court : కరోనా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం ఎంత ఇస్తారో  6 వారాల్లోగా చెప్పాలి

Supreme Court 6 Weeks Ex Gratia For Covid Victims (1)

Supreme Court 6 Weeks Ex Gratia for Covid Victims: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఎంతోమంది ప్రాణాలు పిట్టల్లా రాలిపోయాయి. వేలాదిమంది పిల్లలు తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలయ్యారు. కరోనాతో మృతి చెందినవారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు కనీస నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్‌ మృతులకు నష్టపరిహారం చెల్లించే పిటిషన్‌పై బుధవారం (జూన్ 30,2021)జస్టిస్ అశోక్ భూషణ్ తో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు వెల్లడించింది.

కరోనా వల్ల చనిపోయిన కుటుంబాలకు ఎంత నష్ట పరిహారం అనే అంశాన్ని కేంద్రమే నిర్ణయించుకుని ఎంత ఇస్తారు? అనే విషయంపై ఆరు వారాల్లోగా నివేదిక రూపొందించి కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. విపత్తు చట్టం ప్రకారం పరిహారం ఇవ్వడం తప్పనిసరి కాదని కేంద్రం తన వాదనలు వినిపించింది. కానీ కేంద్ర ప్రభుత్వ వాదనను కోర్టు తిరస్కరించింది. విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ 12 ప్రకారం పరిహారం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది.

ఈ వ్యాఖ్యలపై కేంద్ర స్పందించింది. తమ వద్ద నిధులు సరిపడా లేవనీ..కోర్టుకు విన్నవించింది. కానీ కేంద్ర వాదనను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇవ్వాలి అనేది కేంద్రమే నిర్ణయించి 6 వారాల్లో విధివిధానాలు తయారు చేయాలని సూచించింది. విపత్తులో చనిపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని రికమండేషన్ చేయడంలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఫెయిల్ అయిందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.

కాగా..కోవిడ్ -19 కు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ .4 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని కేంద్రానికి ఆదేశాలు కోరుతూ పిటిషన్లను కోర్టు విచారించింది. ఈ సందర్భంగా కోర్టు విచారణ సందర్భంగా నష్టపరిహారం విషయంలో 6 వారాల్లో నివేదిక అందించాలని ఆదేశించింది.