Agnipath: ‘అగ్నిపథ్’పై 15న సుప్రీంకోర్టు విచారణ

గత జూన్‌లో కేంద్రం ‘అగ్నిపథ్’ స్కీం ప్రవేశపెట్టింది. భారత సైన్యంలో నాలుగేళ్ల సర్వీసుకుగాను ఈ స్కీం ద్వారా నియామకాలు చేపడుతారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నాలుగేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో సైన్యంలోకి తీసుకుంటారు.

Agnipath: ‘అగ్నిపథ్’పై 15న సుప్రీంకోర్టు విచారణ

Agnipath

Agnipath: ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ స్కీంకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 15న విచారణ జరపనుంది. జస్టిస్ డీ.వై.చంద్రచూడ్, ఏ.ఎస్.బొపన్నలతో కూడిన సుప్రీం ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతుంది. గత జూన్‌లో కేంద్రం ‘అగ్నిపథ్’ స్కీం ప్రవేశపెట్టింది. భారత సైన్యంలో నాలుగేళ్ల సర్వీసుకుగాను ఈ స్కీం ద్వారా నియామకాలు చేపడుతారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నాలుగేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో సైన్యంలోకి తీసుకుంటారు. ఇలా ఎంపికైన వారు 15 ఏళ్లు సైన్యంలో కొనసాగాల్సి ఉంటుంది.

Racial Attack: జాతి వివక్ష.. క్లాస్‌మేట్‌కు నిప్పంటించిన విద్యార్థులు

అయితే, ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కొన్నిచోట్ల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ పథకాన్ని రద్దు చేయాలని ఆర్మీలో చేరాలనుకుంటున్న యువత డిమాండ్ చేసింది. పూర్తిస్థాయి నియామకాలు చేపట్టాలని కోరింది. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుల్లో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పథకాన్ని రద్దు చేయాలని పిటిషన్లలో పేర్కొన్నారు. మరోవైపు ఎన్ని నిరసనలు వ్యక్తమైనప్పటికీ కేంద్రం ఈ పథకంపై ముందుకే వెళ్లాలని భావిస్తోంది. ఇప్పటికే నియామకాల నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి యువత నుంచి స్పందన బాగానే ఉందని కేంద్రం చెబుతోంది.