UP Demolitions: యూపీలో కూల్చివేతలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ Supreme Court to hear petitions against UP demolitions today

UP Demolitions: యూపీలో కూల్చివేతలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో కాన్పూర్ జిల్లాతోపాటు, యూపీలోని పలు చోట్ల ఇస్లాం సంఘాల ఆధ్వర్యంలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో పోలీసులు సహా పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు అల్లర్లకు కారణమైన 37 మందిని గుర్తించారు.

UP Demolitions: యూపీలో కూల్చివేతలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

UP Demolitions: ఉత్తర ప్రదేశ్‌లో ఇటీవల హింసకు పాల్పడ్డ నిందితుల ఇండ్లను కూల్చివేస్తోంది అక్కడి సర్కార్. వరుసగా కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కూల్చివేతలకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. జమైత్-ఉలామా-ఇ-హింద్ అనే సంస్థ కూల్చివేతలను ఆపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాన్పూర్ జిల్లాలో కొనసాగుతున్న కూల్చివేతల డ్రైవ్‌పై స్టే ఇవ్వాలని పిల్‌లో కోరింది.

Presidential Elections: రాష్ట్రపతి ఎన్నిక.. మొదటి రోజు 11 నామినేషన్లు

దీనిపై నేడు విచారణ జరగనుంది. జస్టిస్ ఏ.ఎస్.బొపన్న, విక్రమ్ నాథ్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ పిల్‌పై విచారణ జరపనుంది. మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో కాన్పూర్ జిల్లాతోపాటు, యూపీలోని పలు చోట్ల ఇస్లాం సంఘాల ఆధ్వర్యంలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో పోలీసులు సహా పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు అల్లర్లకు కారణమైన 37 మందిని గుర్తించారు. ఈ నిందితుల జాబితాను పోలీసులు స్థానిక ప్రయాగ్ రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీడీఏ)కి అందజేశారు. పీడీఏ ప్రస్తుతం నిందితుల ఇండ్లు, ఇతర ఆస్తులపై దృష్టి సారించింది. ఎవరైనా అక్రమ నిర్మాణాలకు పాల్పడితే, కఠిన చర్యలు తీసుకుని, వాటిని కూల్చివేసే కార్యక్రమం చేపడుతోంది. ఈ కూల్చివేతల్ని ఆపేయాలంటూ జమైత్ సంస్థ పిల్ దాఖలు చేసింది.

Uttar Pradesh: నిద్రిస్తుండగా టేబుల్ ఫ్యాన్ మీద పడి ప్రాణాలు కోల్పోయిన తల్లీకూతురు

అయితే, ఇంతకుముందే జహంగిర్ పురిలో జరిగిన కూల్చివేతల డ్రైవ్‌ను ఆపేయాలని కోర్టును కోరింది. అయితే, ఇలాంటి అక్రమ నిర్మాణాలు కూల్చివేయడంపై తాము స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు చెప్పింది. ఇదే అంశంపై తాజాగా మరో పిల్ దాఖలు చేసింది ఈ సంస్థ. రాష్ట్ర ముఖ్యమంత్రితోపాటు అధికారులు నిందితుల ఇండ్లను కూల్చివేస్తామని ప్రకటించారని, ఇలాంటి చర్యలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్దమని జమైత్ సంస్థ తన పిల్‌లో పేర్కొంది. ఇప్పటికే కాన్పూర్ జిల్లాలో జరిగిన అల్లర్లకు ప్రధాన కారకుడని భావిస్తున్న మహ్మద్ జావేద్ అనే వ్యక్తి ఇంటిని అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే.

×