Hijab row : హిజాబ్‌ పిటిషన్లు విచారించేందుకు బెంచ్ ఏర్పాటు చేస్తాం : CJI NV Ramana

హిజాబ్ ధరించడం మతపరమైన ఆచారంలో భాగం కాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లను విచారించేందుకు ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.

Hijab row : హిజాబ్‌ పిటిషన్లు విచారించేందుకు బెంచ్ ఏర్పాటు చేస్తాం : CJI NV Ramana

SC To Set Up Bench To Hear Pleas Against On Hijab : హిజాబ్ ధరించడం మతపరమైన ఆచారంలో భాగం కాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లను విచారించేందుకు ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీం కోర్టు మంగళవారం (2,2022) వెల్లడించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ మార్చిలో పలు పిటీషన్లు దాఖలయ్యాయని.. విచారణ కోసం వాటిని ఇంకా లిస్టింగ్‌ చేయలేదని సీనియర్‌ న్యాయవాది మీనాక్షి అరోరా చేసిన వాదనలను సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.

ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ..‘ఈ పిటిషన్లపై విచారణకు ఒక బెంచ్‌ను ఏర్పాటు చేస్తాం. న్యాయమూర్తుల్లో ఒకరు అనారోగ్యంగా ఉన్నారు. వారు బాగానే ఉంటే.. ఈ సమయానికిే విచారణకు వచ్చేవి’ అని తెలిపారు. దీంతో న్యాయవాది ప్రశాంత్ భూషన్ మాట్లాడుతూ..ఈ హిజాబ్ వివాదంతో ఆడపిల్లలు చదువుకు దూరం అవుతున్నారని..పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయస్థానానికి విన్నవించారు.

హిజాబ్‌ వస్త్రధారణపై కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు జులై 13న సుప్రీం కోర్టు అంగీకరించింది. కాగా.. 2022 సంవత్సరం ప్రారంభంలో హిజాబ్‌ వివాదం కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. దీనిపై కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరిస్తూ.. హిజాబ్‌.. ముస్లిం మతంలో అనివార్యంగా ఆచరించాల్సిన వస్త్రధారణ కాదని తేల్చి చెప్పింది. విద్యాసంస్థల్లో ఏకరూప (యూనిఫాం) వస్త్రాల నిబంధనలను పాటించాలన్న రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని..ఆదేశాన్ని సమర్థించింది.దీనిపై విద్యార్ధినిలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉందని.. రాజ్యాంగంలోని 15వ అధికరణం దేశ ప్రజలకు కల్పించిన మత, సాంస్కృతిక, భావ ప్రకటనా స్వేచ్ఛను ఇది హరిస్తోందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దీన్ని సవాల్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

కాగా కర్ణాటకలో తలెత్తిన హిజాబ్ వివాదం పలు రాష్ట్రాలకు పాకింది. పలు రాష్ట్రాల్లో హిజాబ్ ధరిస్తే ఆయా విద్యాసంస్థల్లోకి రాకుడదు అంటూ ఆంక్షలు విధించిన విషయం తెలిసింది. దీంతో విద్యార్ధినికి కాలేజీలకు కూడా వెళ్లటం మానుకున్నారు.కొంతమంది అయితే పరీక్షలకు కూడా హాజరుకాని పరిస్థితులను ఎదుర్కొన్నారు.