ET: ఓటీటీలో ఈటీ.. రిలీజ్ ఎప్పుడంటే?

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈటీ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. దర్శకుడు పాండిరాజ్.....

ET: ఓటీటీలో ఈటీ.. రిలీజ్ ఎప్పుడంటే?

Suriya Et Movie Ott Release Date Locked

ET: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈటీ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో సూర్య లాయర్ పాత్రలో కనిపించాడు. అయితే ఈ సినిమా కథ బాగున్నా, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం ఏమాత్రం బాగాలేదు. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ టైమింగ్ చాలా రాంగ్‌గా ఉందని కూడా వారు అభిప్రాయ పడ్డారు. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా చిత్రానికి ఒక్క రోజు ముందు ఈటీ సినిమాను రిలీజ్ చేస్తే ఫలితం ఇలానే ఉంటుందని వారు అంటున్నారు.

Suriya: ఈటి దెబ్బతో సూర్యకు ఓటీటీలే దిక్కా?

ఇక ఈ సినిమాకు తమిళనాడుతో పాటు తెలుగునాట కూడా ఘోరమైన పరాజయం ఎదురైంది. ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎవరూ కూడా ఆసక్తిని చూపకపోవడంతో ఈ సినిమాకు నామమాత్రపు వసూళ్లు కూడా రాలేదు. కాగా ఈ సినిమా రిజల్ట్‌తో నిరాశకు గురైన చిత్ర యూనిట్ ఇక ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈటీ చిత్ర ఓటీటీ హక్కులను సన్ నెక్ట్స్, నెట్‌ఫ్లిక్స్ సంయుక్తంగా భారీ రేటుకు దక్కించుకున్నాయి.

అయితే ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందా అని సదరు ఓటీటీ ప్లాట్‌‌ఫాంలు ఆందోళన చెందుతున్నాయి. అయితే ఈ సినిమాను వీలైనంత త్వరగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధం చేయాలని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1న ఈటీ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Boyapati-Suriya: టాలీవుడ్‌కు తమిళ హీరోలు.. సూర్య స్ట్రైట్ తెలుగు సినిమా?

ఈటీ చిత్ర కథ పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో సాగడంతో ఆడియెన్స్ ఈ సినిమా చూసి చాలా బోర్ ఫీల్ అయ్యారు. ఈ సినిమాలో సూర్య సరసన అందాల భామ ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. మరి థియేటర్లలో బొక్కబోర్లా పడ్డ ఈటీ, కనీసం ఓటీటీలోనైనా ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి.