సుశాంత్ అభిమాని ఆత్మహత్య

సుశాంత్ అకాల మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న అభిమాని..

10TV Telugu News

సుశాంత్ అకాల మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న అభిమాని..

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అందరినీ కలచి వేసింది. హిందీ చిత్ర పరిశ్రమలో సుశాంత్ మరణం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అంతులేని ప్రతిభ ఉన్నా పరిశ్రమలో పెద్దలుగా చలామణీ అవుతన్న వారి చేత అణచివేతకు గురికావడంతోనే అతను ఆవేదనకు లోనై ఆత్మహత్య చేసుకున్నాడు, బాలీవుడ్‌లో బంధుప్రీతి చాలా ఎక్కువ, కొత్త వారిని తొక్కేస్తున్నారు అంటూ ఇండస్ట్రీ ప్రముఖులే బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. సుశాంత్ అకాల మరణాన్ని తట్టుకోలేక అతని వదిన కన్నుమూసిన సంగతి తెలిసిందే.

తాజాగా సుశాంత్ అభిమాని సూసైడ్ చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో జరిగింది. సుశాంత్‌ను ఎంతగానో అభిమానించే అతని వీరాభిమాని అయిన పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి సుశాంత్ ఇక లేడన్న విషయం తెలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కఠిన నిర్ణయం తీసుకున్న ఆ బాలుడు సూసైడ్ నోట్ కూడా రాశాడు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్‌లో సుశాంత్‌ను ఉద్దేశించి ‘అతను ఆ పని చేయగా లేనిది నేనూ ఆ నిర్ణయం తీసుకోలేనా?’ అని రాసినట్లు  పోలీసులు గుర్తించారు.  

Read: సుషాంత్‌పై బాలీవుడ్ కపట సానుభూతి చూపిస్తోంది: సైఫ్ అలీ ఖాన్

×