Sushee Infra : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి షాక్.. సుశీ ఇన్‌ఫ్రాలో జీఎస్టీ అధికారుల సోదాలు

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ ఫ్రాలో జీఎస్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన జీఎస్టీ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నారు.

Sushee Infra : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి షాక్.. సుశీ ఇన్‌ఫ్రాలో జీఎస్టీ అధికారుల సోదాలు

Sushee Infra : మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ ఫ్రాలో జీఎస్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన జీఎస్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సుమారు 20మంది అధికారులు సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్ లోని సుశీ ఇన్ ఫ్రా కార్యాలయంలోని రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.

సుశీ ఇన్ ఫ్రా అండ్ మైనింగ్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన కంపెనీ. ఇందులో జీఎస్టీ సిబ్బంది తనిఖీలు చేయడం కలకలం రేపింది. పన్ను ఎగవేత ఆరోపణలపై జీఎస్టీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సుశీ ఇన్ ఫ్రాకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడు సంకీర్త్ రెడ్డి ఎండీగా వ్యవహరిస్తున్నారు.

పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో దృష్టి సారించిన అధికారులు.. సంస్థ నిర్వహిస్తున్న వ్యాపారానికి సంబంధించి జీఎస్టీ చెల్లింపుల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు సంస్థలపై కేసు నమోదు చేశారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ నీతూ ప్రసాద్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

సుశీ ఇన్‌ఫ్రా అండ్‌ మైనింగ్‌ లిమిటెడ్‌, సుశీ అరుణాచల్‌ హైవేస్‌ లిమిటెడ్‌, సుశీ చంద్రగుప్త్‌ కోల్‌మైన్స్‌ లిమిటెడ్‌ అనే మూడు కంపెనీల ప్రధాన కార్యాలయం బంజారాహిల్స్‌లో ఉంది. సుశీ ఇన్‌ఫ్రా కంపెనీలో ఇద్దరు, అరుణాచల్‌ హైవేస్‌ లిమిటెడ్‌ కంపెనీలో నలుగురు, సుశీ చంద్ర గుప్త్‌ కోల్‌మైన్స్‌లో ముగ్గురు డైరెక్టర్లు ఉండగా.. వాళ్ల ఇళ్లల్లోనూ సోదాలు జరుగుతున్నాయి.

ఈ తనిఖీల్లో అధికారులు పలు డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్‌లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా.. ఈ సోదాలకు సంబంధించిన విషయాన్ని వాణిజ్య పన్నుల శాఖ పూర్తి గోప్యంగా ఉంచింది.

ఇటీవల జరిగిన మునుగోడు ఎన్నికల సమయంలో సుశీ ఇన్ ఫ్రా సంస్థ నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయని టీఆర్ఎస్ ఆరోపించింది. 5 కోట్ల 22 లక్షల రూపాయలు మునుగోడు నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు, వ్యాపార సంస్థలకు చెందిన బ్యాంకుల ఖాతాల్లో పడినట్లు ఆరోపణలు చేసింది. లావాదేవాలకు సంబంధించిన జాబితాను కూడా ఈసీకి ఇచ్చింది. పరిశీలించిన ఈసీ అధికారులు.. వాటిని సుశీ ఇన్‌ఫ్రా లావాదేవీలుగా తేల్చింది. ఈ నేపథ్యంలో సంస్థపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తాజాగా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.