హైదరాబాద్‌లో లాక్‌డౌన్ లేనట్టే..? కారణం ఇదే

  • Published By: naveen ,Published On : July 2, 2020 / 03:00 PM IST
హైదరాబాద్‌లో లాక్‌డౌన్ లేనట్టే..? కారణం ఇదే

హైదరాబాద్ పరిధిలో మరోసారి లాక్ డౌన్ విధించే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్ డౌన్ ఉంటుందా? లేదా? అనేదానిపై క్లారిటీ రావడం లేదు. ప్రభుత్వం నిర్ణయం కోసం నగరవాసులు ఎదురుచూస్తున్నారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ లేనట్టే అని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. లాక్ డౌన్ విధించకుండానే కరోనా నియంత్రణ చర్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలనే యోచనలో ఉంది. వైద్య సౌకర్యాల కల్పనపై స్పెషల్ ఫోకస్ పెట్టనుంది ప్రభుత్వం.

ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న ఆర్థిక పరిస్థితి:
ఇప్పటికే మూడు నెలల కరోనా లాక్ డౌన్ దెబ్బకు కుదేలైన ప్రభుత్వ ఆదాయం లాక్ డౌన్ సడలింపులతో క్రమంగా గాడిన పడుతోంది. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో మరోసారి లాక్ డౌన్ విధిస్తే ఆదాయం పడిపోతుందని ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

లాక్ డౌన్ విధించకుండానే కరోనా కట్టడికి చర్యలు:
కొన్ని రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ లో భారీ సంఖ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి. దాదాపుగా ఏడు వందలకుపైగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. దీంతో నగరవాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మరోసారి లాక్ డౌన్ విధించాల్సిందే అనే అభిప్రాయం వ్యక్తమైంది. అదే సమయంలో గత మూడు నెలులు లాక్ డౌన్ విధించినా అదుపులోకి రాని కరోనా వ్యాప్తి, 15 రోజుల లాక్ డౌన్ తో ఏం వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మరోసారి లాక్ డౌన్ పై ప్రభుత్వం ఆలోచనలో పడింది. పరిస్థితులు చేయి దాటిపోయినట్టు అయితే, అవసరం అనుకుంటేనే లాక్ డౌన్ విధిస్తాము లేదంటే లేదు అనే సంకేతాలు ఇచ్చింది ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ లో లాక్ డౌన్ విధించకుండానే కరోనా రోగులకు పూర్తి స్తాయిలో వైద్య సౌకర్యాలు, సేవలు అందించడంపైనే ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ కరోనా టెస్టులు, చికిత్సకు ఇప్పటికే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.

Read:తెలంగాణలోని ప్రైవేట్ ల్యాబ్స్‌లో కరోనా టెస్టులు నిలిపివేత, కారణం ఇదే