నందిగ్రామ్ లో హోరాహోరీ..ఆరు ఓట్ల ఆధిక్యంలో సువెందు

వెస్ట్ బెంగాల్​లోని నందిగ్రామ్​లో సీఎం మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య ఉత్కంఠభరిత పోరు నడుస్తోంది.

నందిగ్రామ్ లో హోరాహోరీ..ఆరు ఓట్ల ఆధిక్యంలో సువెందు

Suvendu Adhikari Takes Lead Again Ahead Of Mamata Banerjee By 6 Votes

West Bengal Election వెస్ట్ బెంగాల్​లోని నందిగ్రామ్​లో సీఎం మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య ఉత్కంఠభరిత పోరు నడుస్తోంది.17 రౌండ్ల కౌంటింగ్‌లో.. 16 రౌండ్ల కౌంటింగ్​ పూర్తయ్యేసరికి సువేందు 6 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. చివరి రౌండ్(17వ రౌండ్) కౌంటింగ్ కొన‌సాగుతోంది.

మొత్తంగా రాష్ట్రంలో తృణమూల్​ ఇప్పటికే 44 చోట్ల గెలుపొందింది. మరో 160కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 90లోపు స్థానాలకే పరిమితమయ్యే సూచనలున్నాయి.