Custard apple : మధుర ఫలం..సీతాఫలం

దీర్ఘకాలంపాటు చక్కెర వ్యాధితో బాధపడేవారు కొన్ని సీతాఫల ఆకులను సేకరించి వాటిని నీళ్లలో మరిగించి కషాయాన్ని ప్రతిరోజూ పరగడుపున కొన్ని రోజులపాటు తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఈ ఆకుల్లో ఉన్న అధిక మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

10TV Telugu News

Custard apple : రుచిగా ఉండే పండ్లలో సీతాఫలం కూడా ఒకటి..శీతాకాలం ప్రారంభం అయిందంటే ఈ పండ్లు మార్కెట్లో విరివిగా లభిస్తుంటాయి. ఏడాదికి ఒకసారైనా సీతాఫలాల రుచి చూడాలన్న కోరికతో ఉంటారు. ఇంగ్లీషులో కస్టర్డ్ యాపిల్స్ గా పిలిచే సీతాఫలం ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. సీతాఫలం అద్భుతమైన రుచితో పాటు మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా అందించడంలో కీలక పాత్ర వహిస్తాయి.

అలాగే సీతాఫలం మొక్కలోని ఆకులు, బెరడు, వేరు ఇలా ప్రతి భాగంలోనూ ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. 100 గ్రాముల సీతాఫల గుజ్జు నుండి 94 క్యాలరీల శక్తి, 25 గ్రాముల పిండి పదార్ధాలు, 2.5 గ్రాముల ప్రొటీన్లు, 4.4గ్రాముల పీచుపదార్ధాలు లభిస్తాయి. కెరోటిన్, థైమీన్, రిబోప్లెవిన్, నియాసిన్, విటమిన్ సి వంటి విటమిన్లు సీతఫలంలో అధికంగా ఉంటాయి.

ఆయుర్వేద చికిత్సలో సీతాఫలం ఆకులను, బెరడు, వేర్లను ఉపయోగించి డయాబెటిస్, గుండె జబ్బులు చర్మ వ్యాధులు, డయేరియా వంటి వ్యాధులకు అద్భుత పరిష్కారం చెప్తారు. సీతాఫలం మొక్క బెరడును నీళ్లలో బాగా మరిగించి మిగిలిన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకున్నట్లయితే ప్రమాదకర డయేరియా వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది.

దీర్ఘకాలంపాటు చక్కెర వ్యాధితో బాధపడేవారు కొన్ని సీతాఫల ఆకులను సేకరించి వాటిని నీళ్లలో మరిగించి కషాయాన్ని ప్రతిరోజూ పరగడుపున కొన్ని రోజులపాటు తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఈ ఆకుల్లో ఉన్న అధిక మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

సీతాఫలం ఆకుల్లో యాంటీబ్యాక్టీరియల్ యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కావున వీటిని ప్రతిరోజూ కషాయంగా చేసుకుని తాగితే సీజనల్ గా వచ్చే వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు మరియు ఆకులను పేస్ట్ గా చేసి గాయాలపై రాసినట్లయితే గాయాలు త్వరగా మానడంతో పాటు చర్మ సమస్యలు తొలగుతాయి.

మలబద్ధకంతో బాధపడేవారు సీతాఫలాలను తుంటే జీర్ణప్రక్రియ మెరుగవుతుంది. నోటిలో జీర్ణ రసాలను ఊరేలా చేసే గుణం ఈ పండుకు ఉంటుంది. జలుబు,దగ్గు అయాసంతో బాధపడేవారు ఈ పండును పరిమితంగా తీసుకోవటం ఉత్తమం. మధుమేహ రోగులు సీతాఫలం తినకపోవటమే మేలు. ఎందుకంటే చక్కెరల శాతం చాలా ఎక్కవగా ఉంటుంది. ఖాళీ కడుపుతో సీతాఫలాలను తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

10TV Telugu News