Swiggy: పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోంకు స్విగ్గీ గ్రీన్ సిగ్నల్

స్విగ్గీ పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం ఇచ్చిన స్టేట్మెంట్‌లో ఎక్కడ నుంచైనా పనిచేసుకునేందుకు వెసలుబాటు కల్పించింది. కార్పొరేట్, సెంట్రల్ బిజినెస్, టెక్నాలజీ టీంలకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చేశారు. ప్రతి త్రైమాసికానికి ఒకసారి బేస్ లొకేషన్‌లో సమావేశమవుతారు.

Swiggy: పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోంకు స్విగ్గీ గ్రీన్ సిగ్నల్

Swiggy

 

 

Swiggy: స్విగ్గీ పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం ఇచ్చిన స్టేట్మెంట్‌లో ఎక్కడ నుంచైనా పనిచేసుకునేందుకు వెసలుబాటు కల్పించింది. కార్పొరేట్, సెంట్రల్ బిజినెస్, టెక్నాలజీ టీంలకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చేశారు. ప్రతి త్రైమాసికానికి ఒకసారి బేస్ లొకేషన్‌లో సమావేశమవుతారు.

మిగిలిన వారికి వర్క్ ఫ్రమ్ హోం పూర్తిగా ఇచ్చినా బేస్ లొకేషన్లలో ఉండేవారికి కొన్ని రోజులు మాత్రం ఆఫీసు నుంచి పనిచేయాల్సి ఉంటుంది.

“రెండు సంవత్సారల్లో ఇంటి నుంచి పనిచేయడంతో ప్రొడక్టివిటీ పెరిగినట్లు తెలిసింది. పలువురు మేనేజర్లు, ఉద్యోగుల నుంచి ఫ్యీడ్ బ్యాక్ తీసుకున్నాం” అని స్విగ్గీ తెలిపింది. ఫలితంగా శాశ్వతంగా ఇంటి నుంచే పనిచేసేందుకు పర్మిషన్ ఇచ్చింది.

Read Also: 2022 న్యూ ఇయర్‌కు స్విగ్గీ-జొమాటో ఆర్డర్ల రికార్డు..!

“ఉద్యోగులకు వారి వ్యక్తిగత జీవితంలో సౌలభ్యాన్ని కల్పించడమే మా ఫోకస్. ప్రపంచ, స్థానిక ప్రతిభ పోకడలను గమనించాం, అదే సమయంలో ఉద్యోగులు, మేనేజర్లు, నాయకుల నుంచి ఫీడ్ బ్యాక్ వింటున్నాం,” అని Swiggy హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ గిరీష్ మీనన్ అన్నారు.