స్విగ్గీలో 1100మంది ఉద్యోగుల తొలగింపు

  • Published By: venkaiahnaidu ,Published On : May 18, 2020 / 07:46 AM IST
స్విగ్గీలో 1100మంది ఉద్యోగుల తొలగింపు

కరోనా సంక్షోభం కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగలను తొలగించే పని ప్రారంభించాయి. లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలోనే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు వరుసగా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టాయి. ఇప్పటికే తమ ఉద్యోగులలో13 శాతం మందిని తొలగించినట్లు ఇటీవల ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ప్రకటించగా,ఇప్పుడు అదే బాటలో స్విగ్గీ చేరింది.

దేశవ్యాప్త లాక్ డౌన్ 4.0 ఇవాళ్టి నుంచి ప్రారంభమైన సమయంలో స్విగ్గీ నుంచి ఉద్యోగులకు ఈ బ్యాడ్ న్యూస్ వచ్చింది. రాబోయే కొన్ని రోజుల్లో 1,100మంది(14శాతం)ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ సోమవారం(మే-18,2020)ప్రకటించింది. ఊహించనివిధంగా ఉద్యోగాల తగ్గింపు ప్రక్రియను చేపట్టాల్సి రావడం…ఈ రోజు స్విగ్గీకి విచారకరమైన రోజులలో ఒకటి అని స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు,సీఈవో శ్రీహర్ష మజీతీ.. తమ ఉద్యోగులకు ఇవాళ పంపిన ఈ మెయిల్ లో తెలిపారు.

చాలా అస్థిరంగా ఉన్న లేదా చాలా సందర్భోచితంగా ఉండని సమీప వ్యాపారాలను రాబోయే 18 నెలల పాటు మూసివేయనున్నట్లు స్విగ్గీ CEO తెలిపారు. కరోనా కారణంగా తమ వ్యాపారం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపారు.  ఎంతకాలం ఈ అనిశ్చితి కొనసాగుతుందో ఎవ్వరికీ తెలియదని, అయితే తక్కువ కాలం దీని ప్రభావం స్విగ్గీపై దీని ప్రభావం తక్కువ కాలం ఉంటుందని ఆశిస్తున్నట్లు ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ లో స్విగ్గీ సీఈవో తెలిపారు.

Read: రెడ్ జోన్లలోనూ ఈ కామర్స్ ‘నాన్-ఎసెన్షియల్స్’ డెలివరీకి అనుమతి