Svims Hospital: ఆక్సిజన్ సంక్షోభం అంచున స్విమ్స్.. కోత విధించిన కాంట్రాక్టర్!

తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఇంకా కళ్ళముందు కదలాడుతుండగానే ఇదే తిరుపతి నగరంలోని మరో ఆసుపత్రి ఆక్సిజన్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.

Svims Hospital: ఆక్సిజన్ సంక్షోభం అంచున స్విమ్స్.. కోత విధించిన కాంట్రాక్టర్!

Swims On The Brink Of Oxygen Crisis Contractor Who Imposed Cuts

Svims Hospital: తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఇంకా కళ్ళముందు కదలాడుతుండగానే ఇదే తిరుపతి నగరంలోని మరో ఆసుపత్రి ఆక్సిజన్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. స్విమ్స్ ఆసుపత్రికి ఎన్నో ఏళ్ళుగా ఆక్సిజన్ సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ ఇప్పుడు కరోనా వేళ కోత విధించడం కలవరపెడుతుంది. కాంట్రాక్టర్ కోత విధించడంతో అధికారులు ఇప్పుడు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తుంది.

తమిళనాడులోని ఎయిర్ వాటర్ కంపెనీ గత 15 సంవత్సరాలుగా స్విమ్స్‌ ఆసుపత్రికి ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. రెండు విడతలుగా రోజుకు 14 కేఎల్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఎయిర్ వాటర్ కంపెనీ నుండి సరఫరా జరుగుతోంది. అయితే ప్రస్తుతం 8కేఎల్‌కి మించి ఆక్సిజన్ పంపించలేమని కాంట్రాక్టర్ స్విమ్స్ ఆసుపత్రికి తేల్చిచెప్పేశారు. దీని వెనుక తమిళనాడు ప్రభుత్వ ఒత్తిడి ఉందని స్విమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. సొంత రాష్ట్రం తమిళనాడుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎయిర్ వాటర్ కంపెనీకి డిమాండ్లు పెరిగినట్లుగా తెలుస్తుంది.

మొత్తంగా ఎయిర్ వాటర్ కంపెనీ ఆక్సిజన్ సరఫరాలో కోత విధించడంతో ఇప్పుడు చిత్తూరు జిల్లా అధికారులు, స్విమ్స్ అధికారులు ఆక్సిజన్ కోతపై దృష్టి సారించారు. స్విమ్స్‌లో ప్రస్తుతం 467 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతుండగా ఇందులో 90 శాతం పడకలకు ఆక్సిజన్ అవసరం ఉంటోంది. రుయా ఘటన దృష్ట్యా స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ ఇక్కడ పరిస్థితిని చిత్తూరు జిల్లా కలెక్టర్, స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.

తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపి ఎయిర్ వాటర్ కంపెనీ నుండి కోత లేకుండా చూడటం లేదా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని స్విమ్స్ డైరెక్టర్ కోరారు. కాగా, మరోవైపుకు ఇప్పటికిప్పుడు ఆక్సిజన్ కొరత నుండి బయటపడాలంటే ప్రస్తుతం కర్ణాటక నుండి ఆల్టర్నేటివ్ సరఫరాకు ఎయిర్ వాటర్ సంస్థ సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే.. ప్రస్తుత పరిస్థితిలో ఆల్టర్నేటివ్ కన్నా శాశ్వత పరిష్కారానికి ఉన్నధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.

Read: CM Stalin: కోవిడ్ కమాండ్ సెంటర్లో ఆకస్మిక తనిఖీ.. బాధితులతో మాట్లాడిన సీఎం!