You’re Healthy : మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో..ఇలా తెలుసుకోండి..!

మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో..ఇలా తెలుసుకోండి..వీటిలో ఏ తేడాలు ఉన్నా..వెంటనే నిపుణులను సంప్రదించండి.

10TV Telugu News

body health symptoms tests : మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవటానికి రెగ్యులర్ గా చెకప్ లు చేయించుకోవాలి. ఇలా పరీక్షలు చేయించుకోవటం చాలా అవసరం కూడా. కానీ వీటికి చాలా ఖర్చు అవుతుంది. కానీ మీ ఆరోగ్యం ఎలా ఉందో..అసలు ఆరోగ్యంగా ఉందో లేదో మనమే కొన్ని తేలికపాటి పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. వాటి ద్వారా మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదో తెలుసుకోవచ్చు.సాధారణంగా మన శరీరం అనేక రకాల అనారోగ్యాలని పసిగట్టేస్తుందనే విషయం తెలుసా? నిజమే మనం అనారోగ్యంగా ఉన్నాయో లేదో మన శరీరంలోని కొన్ని మనకు తెలియజేస్తాయి. కొన్ని లక్షణాల ద్వారా ఆ విషయం మనకు తెలుస్తుంది. కానీ మనమే ఆ లక్షణాలను కూడా పట్టించుకోకుండా ఉంటాం. అయితే ఒకవేళ ఆ లక్షణాలని మనం అర్థం చేసుకుంటే ముందుగానే అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. డాక్టర్లు కూడా అనారోగ్యాల వల్ల కలిగే లక్షణాలు గురించి కనుగొన్నారు. మరి అవేంటో తెలుసుకోండి…మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలుసుకోండి..

పిడికిలిని పిడికిలిని బిగిసిపట్టండి..
మీ వేళ్లను బిగించండీ..గట్టిగా పిడికిలిని బిగిసిపట్టండి. అప్పుడు మీ చేతిని గట్టిగా పట్టుకోండి. 30 సెకన్ల పాటు అలాగే ఉండండి. తరువాత మీరు మీ చేతిని విడుదల చేసిన తర్వాత..మీ అరచేతి మునుపటి కంటే కొంచెం తెల్లగా మారిందని మీరు గమనించవచ్చు. రక్త ప్రసరణ తగ్గడం దీనికి కారణం. అలా మీ అరచేతిని గమనించండి. దాని సాధారణ రంగుకు తిరిగి రావడానికి పట్టే టైముని చెక్ చేయండి. తిమ్మిరిగా ఉన్నట్లు లేదా రక్తం వెనక్కి వెళ్లడానికి కొంత సమయం లేదా అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే..అది ఆర్టిరియోస్క్లెరోసిస్‌కు సంకేతం కావచ్చు. ఈ పరిస్థితిలో గుండె నుండి శరీరంలోని మిగిలిన భాగాలకు ఆక్సిజన్, పోషకాలను తీసుకువెళ్లే రక్త నాళాలు మారుతాయి.

కాలు పైకి లేపి పట్టుకోండి..
నేలపై ఫ్లాట్‌గా పడుకోండి.ముఖం నేలకు నిదానంగా ఉంచాలి. మీ చేతులను మీ శరీరానికి అనుగుణంగా నేరుగా ఉంచండి. మీ శరీరం నేలపై విశ్రాంతి తీసుకునేటప్పుడు మీ రెండు కాళ్లను నెమ్మదిగా పైకి ఎత్తండి. మీరు 30 సెకన్ల పాటు అలా ఉంచండి. అలా ఎంత సేపు ఉంచగలరో గమనించండీ. మీరు వాటిని స్థిరంగా లేదా కలిసి ఉంచడంలో సమస్యలను ఎదుర్కోలేకపోతే లేదా ఎదుర్కొంటే, మీ ఉదరం లేదా మీ వెన్నెముకలో కొంత సమస్య ఉన్నట్లు లెక్క.

వేళ్లు చెప్పే ఆరోగ్యం..
వేళ్ల గోళ్లను గట్టిగా నొక్కండి..పిండినట్లుగా నొక్కి పట్టండి..అలా ఒక్కో వేలుని నొక్కండి..
-బొటనవేలు నొప్పి శ్వాసకోశ సమస్యలను సూచిస్తుంది.
-చూపుడు వేలు పెద్దప్రేగు,జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను సూచిస్తుంది.
– మధ్య వేలు హృదయ సంబంధ సమస్యలకు సంకేతం.
– ఉంగరపు వేలు గుండెకు సంబంధించిన సమస్యలను కూడా సూచిస్తుంది.
– అతిచిన్న వేలు చిన్న ప్రేగు సమస్యలతో ముడిపడి ఉంటుంది.

ప్రతి వేలు శరీరంలోని వివిధ భాగాలతో ముడిపడి ఉందని పరిగణనలోకి తీసుకుంటే, వాటి ద్వారా ఏవైనా అనారోగ్యాలను గుర్తించవచ్చు. చేతి వేళ్లపై నీలి రంగులో కనిపిస్తుంటే మచ్చలు ఉంటే రక్తప్రసరణ సరిగా జరగడం లేదని అర్ధం. దీన్ని రేనూడ్‌ సిండ్రోమ్‌ అంటారు. ఇది అంత ప్రమాదకమైనదేమీ కాదు. కానీ దీని వల్ల చేతివేళ్లు, అరికాళ్లు ఎరుపు, నీలం లేదా తెలుపు రంగులోకి మారతాయి. అప్పుడు మంటతోపాటు దురద కూడా పుడుతుంది. అప్పుడప్పుడు జ్వరం కూడా వస్తుంటుంది.

వణికే చేతులు
కెఫిన్‌ ఎక్కువగా తీసుకునే వారిలో, ఆందోళనలో ఉన్నవారిలో, ఆస్తమా, ఇతర మానసిక రోగాలకి సంబంధించిన మందులు వాడేవారిలో ఈ రకమైన సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే నరాల బలహీనత ఉండేవారిలో కూడా ఈ సమస్య ఉంటుంది. కొంతమందికి అరచేతుల్లో చెమట వస్తుంటుంది. ఎక్కువగా ఒత్తిడికి గురైనా, జీవక్రియరేటుని ప్రేరేపించే ఓవర్‌ యాక్టివ్‌ థైరాయిడ్‌ విడుదలయినప్పుడు అరచేతుల్లో చెమట పుడుతుంది. కానీ ప్రతిరోజూ ఇలానే జరుగుతుంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించాలి.

శరీరంలో మరిన్ని సూచనలు..
యూరిన్:
మూత్ర విసర్జన చేసినప్పుడు ఎప్పుడైనా గమనించారా…? సాధారణంగా ఆరోగ్యంగా ఉండే వాళ్లలో ఎటువంటి వాసన ఎక్కువగా రాదు. పైగా అది లేద పసుపు రంగులో ఉంటుంది. అలానే ఉన్నట్టయితే మీకు ఎటువంటి అనారోగ్య సమస్య లేనట్టే.

గోళ్ళు..
మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదో గోళ్ళు కూడా తెలియజేస్తాయి. చేతుల గోళ్లపై, కాళ్ళ గోళ్ళ పై విచిత్రమైన గీతలు ఉండటం. లేదా పగిలినట్లుగా ఉండటం..రంగు తగ్గటం వంటివి ఉంటే ఆరోగ్య సమస్య ఉన్నట్టే. ఎప్పుడూ గోళ్లు లేత గులాబీ రంగులో ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా అనారోగ్యాల బారిన పడితే గోళ్ల రంగు కూడా మనకి అనారోగ్యం ఉన్నట్టు సూచిస్తాయి.

ఎత్తు పెరుగుదలలో లోపం..
ఎప్పుడైనా మనిషి ఎత్తు ఎదుగుతూ ఉంటాడు. కానీ ఎత్తు తగ్గిపోవడం అన్నది ఎప్పుడైనా విన్నారా…? బహుశా దీనికి పెద్దగా ఎవ్వరికి అవగాహన ఉండదు. చాలా మందికి ఈ విషయం తెలియదు. కానీ ఎత్తు తగ్గిపోవటం జరిగితే అది బోన్స్ వల్ల కలిగే సమస్య. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ సంగతి తెలుసు. ప్రోటీన్ కాల్షియం లాంటి న్యూట్రియంట్స్ తగ్గిపోయినప్పుడు ఇలా జరుగుతుంది.

ఒంట్లో కొవ్వు శాతం..
ఆరోగ్యంగా ఉండే వాళ్ళకి సమతుల్యమైన ఫ్యాట్ పర్సెంట్ ఉంటుంది. ఎక్కువగా కొవ్వు ఉంది అంటే వీక్ మజిల్స్ వల్లే జరుగుతుంది. జాగింగ్, వాకింగ్ చేయకపోవడం..ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఈ సమస్య వస్తుంది.

శ్వాస తీసుకోవటంలో సమస్య..శ్వాసలో దుర్వాసన
శ్వాస సక్రమంగా తీసుకుంటుంటే ఆరోగ్యంగా ఉన్నట్లు. లేదా శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు కలిగితే అనారోగ్యం ఉన్నట్లుగా గమనించాలి. అలాగే నోట్లోంది దుర్వాసన వచ్చినా సమస్య ఉన్నట్లే నని తెలుసుకోవాలి. సాధారణంగా చాలామందికి దవడలు వాపు వస్తాయి. అలా వచ్చినప్పుడు కూడా శ్వాస దుర్వాసన వస్తుంది. చెడు శ్వాస మీ రోగ నిరోధక వ్యవస్థకు కూడా సంబంధం కలిగి ఉంది. చెడు శ్వాస లేదు అంటే మీకు రోగనిరోధక శక్తి బాగానే ఉన్నట్లే

కాళ్లల్లో వాపులు..
కాళ్లల్లో వాపులు కేవలం ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఉంటే మాత్రమే రావు. మీ కాళ్లలో వాపులు ఉంటే అది థైరాయిడ్ సంకేతం కావచ్చు.లేదా గుండెజబ్బులకు సంకేతం కావచ్చునని గుర్తించాలి.అలా ఉంటే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి.వారి సూచనల మేరకు మెడిసిన్స్ తీసుకోవాలి.

పెదవులు పొడిబారడం..
పెదవులు పొడిబారిపోతే చాలా మంది లిప్ బామ్ రాసుకుంటూ ఉంటారు. కానీ ప్రతి సారి పెదాలు పొడిబారి పోతున్నాయి అనేది పెద్ద సమస్య అనే గుర్తించాలి.విటమిన్స్ లోపం ఉంటే ఇలా జరుగుతుంది. దీంతో డాక్టర్లను సంప్రదించి వారి సూచనల మేరకు విటమిన్స్ లోపానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వేళకు నిద్ర..
మీరు సరిగ్గా నిద్ర పోలేక పోతున్నారా..? నిద్ర పట్టకపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. చెడు ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా నిద్ర పట్టదు. అలాగే మానసిక ఒత్తిడి ఉన్నా నిద్ర పట్టదు. సో నిద్ర పట్టలేదు అంటే ఏదో సమస్య ఉందని గుర్తించాలి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

శరీర టెంపరేచర్..
మన శరీరంలో తగినంత వేడి ఉండాలి. అవయవాలు చల్లగా ఉన్నాయి అంటే అది అనారోగ్యానికి సంకేతమని తెలుసుకోవాలి. తరచు శరీరం చల్లగా ఉంటోంది అంటూ వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. అర చేతులు..పాదాలు చల్లబడటం మంచిది కాదు. రక్త ప్రసరణ సరిగా లేకపోతే ఇటువంటి సమస్యలు వస్తాయి. ఎప్పుడైతే మీకు సరిగ్గా రక్తం వెళ్లడం లేదు అంటే అప్పుడు ఈ సమస్యలు వస్తాయి. ఇలా జరిగితే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి..

చర్మం..
చర్మాన్ని బట్టే కూడా మనం ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు.సరైన డైట్ తీసుకోకపోవడం కూడా చర్మం ఆరోగ్యం తగ్గుతుంది. శరీరంపై వింత మచ్చలు కనుక ఉన్నాయి అంటే తప్పకుండా ఏదో అనారోగ్య సమస్య అని గుర్తించండి. ఆ మచ్చలు పలు రంగుల్లో ఉంటాయి. ఏది ఏమైనా శరీరంపై మచ్చలుంటే డాక్టర్ ని సంప్రదించాలి. అలాగే శరీరంపై పగుళ్లు ఉంటే విటమిన్స్ లోపం అని తెలుసుకోవాలి.

×